న‌యా నైజాం మెగాస్టార్‌

Last Updated on by

నైజాం మెగాస్టార్‌గా ఇంత‌కాలం నితిన్‌కి పేరుండేది. కానీ ఇప్పుడు అది చెరిగిపోతోంది. అత‌డి ప్ర‌భ మ‌స‌క‌బారుతోంది. వ‌రుస ప‌రాజ‌యాల‌తో నితిన్ కెరీర్ అంత‌కంత‌కు దిగ‌జారుతోంది. `అఖిల్` చిత్రంతో నిర్మాత‌గా భంగ‌ప‌డ్డాడు. అటుపై తాను హీరోగా న‌టిస్తున్న సినిమాలు డిజాస్ట‌ర్లుగా నిలుస్తున్నాయి. ఇటీవ‌లే రిలీజై అట్ట‌ర్‌ఫ్లాపులైన‌ లై, శ్రీ‌నివాస‌క‌ళ్యాణం చిత్రాలు అత‌డిని మ‌రింత‌గా దిగ‌జార్చ‌డంపై ఫిలింన‌గ‌ర్‌లో చ‌ర్చ సాగుతోంది.

స‌రిగ్గా ఇలాంటి టైమ్‌లో ఊహించ‌ని రీతిలో నైజాంలో వేరొక మెగాస్టార్ పుట్టుకొచ్చాడు. అత‌డే విజ‌య్ దేవ‌ర‌కొండ‌. నితిన్‌కి ద‌క్క‌నిది దేవ‌ర‌కొండ‌కు ద‌క్కుతోంది. వ‌రుస విజ‌యాల‌తో దేవ‌ర‌కొండ ఇమేజ్ అంత‌కంత‌కు స్కైని తాకుతోంది. పాములు, నిచ్చెన‌ల ఆట వైకుంఠ‌పాళిలో అత‌డు ఒక్కో మెట్టు తెలివిగా ఎక్కుతున్నాడు. దేవ‌ర‌కొండ ఇప్ప‌టివ‌ర‌కూ నిచ్చెన మీద‌నే వెళుతున్నాడు. నితిన్ స‌ర్పాల నోట్లో చిక్కుకుని అంత‌కంత‌కు కిందికి వెళుతుంటే దేవ‌ర‌కొండ మాత్రం తెలివిగా పాముల్ని కిందికి నెట్టి, తాను నిచ్చెన వ‌ద‌ల‌డం లేదు. నైజాం మెగాస్టార్ ఎవ‌రు? అని ఇప్పుడు ప్ర‌శ్నిస్తే.. ఇన్నాళ్లు నితిన్‌.. ఇప్పుడు దేవ‌ర‌కొండ‌..! అందుకు ప్రూఫ్‌గా ఈ ఫోటో నిలుస్తోంది. `గీత గోవిందం` హిట్ టాక్ తెచ్చుకున్న వేళ మెగాస్టార్ చిరంజీవికి ప్ర‌త్యేకించి ఓ ప్రివ్యూ షోని వేసింది యూనిట్‌. ఈ షో అనంత‌రం మెగాస్టార్ దేవ‌ర‌కొండ‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ త‌న న‌ట‌న‌ను పొగిడేశారు. మెగాస్టార్ ప్ర‌శంస‌లు ద‌క్క‌డంతో దేవ‌ర‌కొండ ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యాడు. అల్లు అర‌వింద్‌, ప‌ర‌శురామ్ ఆ ఫ్రేమ్‌లో న‌వ్వులు చిందిస్తూ విజ‌య‌గ‌ర్వంతో ఉప్పొంగుతున్నారు. ఈ ఫోటో చూస్తే ఆ సీన్ మీకే అర్థం కావ‌డం లేదూ?

User Comments