రౌడీకి 15 మందితో ట్రైనింగ్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ త్వరలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ కలయికలో వస్తున్న చిత్రం పేరు `ఫైటర్`. ‘ఇస్మార్ట్ శంకర్`తో ఫామ్లోకి వచ్చిన పూరి… ఈసారి పాన్ ఇండియా రేంజ్లో అదరగొట్టాలనేది ప్లానింగ్. అందుకే `ఫైటర్`ని తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఇతర పోరాట కళల్లో శిక్షణ తీసుకుంటున్నాడు.

అందుకోసం థాయ్లాండ్ వెళ్లాడు. అక్కడ 15 మంది ట్రైనర్స్ను నియమించినట్టు నిర్మాతలు తెలిపారు. ‘ఫైటర్’లో ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్న విజయ్ ప్రస్తుతం ఆ ట్రైనర్స్ దగ్గర కఠిన శిక్షణ తీసుకోవడంతో పాటు కఠిన ఆహార నియమాల్ని పాటిస్తున్నాడు. ఈ నెలాఖరులో ముంబైలో ‘ఫైటర్’ చిత్రీకరణ మొదలవుతుంది. రౌడీ అక్కడ్నుంచి తిరిగొచ్చేలోపు ఇక్కడ హీరోయిన్ని సెట్ చేయబోతున్నారు.