ట్యాక్సీకి గేర్లు ప‌డ‌టం లేదుగా..!

Last Updated on by

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇప్పుడు ఈ పేరుకు బాగానే క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి పుణ్య‌మా అని మ‌నోడు బాగానే ఫేమ‌స్ అయ్యాడు. అయితే ఇదే ఊపులో రెండు మూడు సినిమాల‌కు కూడా క‌మిట‌య్యాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా విడుద‌ల కాలేదు. అందులో షూటింగ్ పూర్తి చేసుకున్న ట్యాక్సీవాలా కూడా ఉంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తై చాలా కాల‌మైంది. రాహుల్ సంక్రీత్య‌న్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ తో పాటు గీతా ఆర్ట్స్ 2 ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ట్యాక్సీ డ్రైవ‌ర్ గా న‌టిస్తున్నాడు విజ‌య్. ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లై కూడా చాలా రోజులైంది.

ముందు ఈ చిత్రాన్ని మే 18న విడుద‌ల చేస్తామ‌న్నారు.. కానీ సారి సారి తుస్ అన్నారు. వెంట‌నే జూన్ 4 అన్నారు. కానీ అది కూడా కాద‌ని తేలిపోయింది. ఇప్పుడు జూన్ లో కూడా రాదంటున్నారు. అస‌లు ఎప్పుడు వ‌స్తుందో కూడా క్లారిటీ లేదు. మ‌రోవైపు విజ‌య్ కూడా ట్యాక్సీ వాలా గురించి త‌న‌ను ఏమీ అడ‌గొద్దంటున్నాడు. ప్ర‌స్తుతానికి వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం మాత్రం ఇది హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ అని ప‌క్కా. ఇందులో ప్రియాంక జుల్క‌ర్ హీరోయిన్. మొత్తానికి.. అర్జున్ రెడ్డితో ర‌చ్చ చేసిన విజ‌య్.. ట్యాక్సీవాలాతో ఆ జోరు కొన‌సాగిస్తాడో లేదో..?

User Comments