కుర్రాడు కుమ్మేస్తున్నాడు బాబోయ్..

ఇండస్ట్రీలో హిట్ తోనే పని. అది ఉంటే అంతా మన చుట్టూనే ఉంటారు. లేదంటే ఒక్కరు కూడా కనిపించరు. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ టైమ్ నడుస్తుంది. అనామకుడిగా వచ్చి సంచలనాలు సృష్టిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అర్జున్ రెడ్డితో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు.

పెళ్లిచూపులు ఏదో ఫ్లూక్ లో తగిలిందిలే అనుకుంటే.. అర్జున్ రెడ్డితో తాను గాలి వాటం కాదని నిరూపించుకున్నాడు విజయ్. ఈ చిత్రంతో అరాచకాలే చేసాడు. కేవలం 6.5 కోట్లకు అమ్మితే.. ఏకంగా శాటిలైట్ తో కలిపి 40 కోట్ల వరకు తీసుకొచ్చాడు అర్జున్ రెడ్డి.

ఇప్పుడు విజయ్ డేట్స్ కోసం చిన్న సైజ్ యుద్ధమే జరుగుతుంది ఇండస్ట్రీలో. పైగా పెద్ద నిర్మాతలే ఈ కుర్రాడి కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే గీతాఆర్ట్స్ లో వరసగా రెండు సినిమాలు చేస్తున్నాడు విజయ్.

అల్లు అరవింద్ నిర్మాణంలో పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమా షూటింగ్ మొదలైంది. ఇక దీంతోపాటు త్రివిక్రమ్ నిర్మాణంలో నందినిరెడ్డి దర్శకురాలిగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇక కొత్త దర్శకులు రాహుల్ సంక్రీత్యన్.. భరత్ కమ్మలతో చెరో సినిమా చేస్తున్నాడు విజయ్. ఇవన్నీ కానీ హిట్టయ్యాయంటే విజయ్ ను ఆపడం ఎవరి వల్ల కాదు. పైగా మనోడు తెలంగాణ యాసకు మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

Follow US