విజ‌య్ బిస్కెట్స్ మామూలుగా లేవుగా..

విజ‌య్ అంటే ఇక్క‌డ త‌మిళ హీరో విజ‌య్ కాదు.. మ‌న విజ‌య్ దేవ‌ర‌కొండ కేరాఫ్ అర్జున్ రెడ్డి. మ‌నోడి టైమ్ ఇప్పుడు పీక్స్ లో న‌డుస్తుంది. వ‌ర‌స ఆఫ‌ర్ల‌తో పిచ్చెక్కిస్తున్నాడు విజ‌య్. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఐదు సినిమాల్లో న‌టిస్తున్నాడు ఈ హీరో ఇప్పుడు. అర్జున్ రెడ్డి త‌ర్వాత గీతా ఆర్ట్స్ సంస్థ‌లో కొత్త ద‌ర్శ‌కుడితో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసాడు విజ‌య్. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఇదిలా ఉండ‌గానే ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా కూడా గీతాఆర్ట్స్ లోనే చేస్తున్నాడు. వీటికితోడు రాహుల్ సంక్రీత్య‌న్, భ‌ర‌త్ క‌మ్మ అనే కొత్త ద‌ర్శ‌కుల‌తోనూ సినిమాల‌కు క‌మిట‌య్యాడు విజ‌య్.

Vijay devarakonda working with anushka and trivikram

ఇన్ని సినిమాల‌తో బిజీగా ఉండ‌గానే ఇప్పుడు త్రివిక్ర‌మ్.. అనుష్క‌ల‌తో త‌న సినిమాలు క‌న్ఫ‌ర్మ్ చేసాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అంటే వాళ్ళ‌తో క‌లిసి సినిమా చేస్తున్నాడ‌ని కాదు.. చేస్తాన‌నే ఆశాభావం వ్య‌క్తం చేసాడు. వాళ్ల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అనుష్క‌, త్రివిక్ర‌మ్ ఫోటోలు పోస్ట్ చేసి.. హ్యాపీ బ‌ర్త్ డే.. వ‌ర్క్ విత్ యూ వెరీ సూన్ అని రాసాడు విజ‌య్. అంత న‌మ్మ‌కం లేకుండానే వాళ్లిద్ద‌రితో వ‌ర్క్ చేయ‌బోతున్నాన‌ని ఓపెన్ గా అనౌన్స్ చేయ‌డు క‌దా..! అన్న‌ట్లు ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ తో విజ‌య్ సినిమా క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌క‌పోయినా.. నందినిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టించ‌బోయే సినిమాను త్రివిక్ర‌మ్ నిర్మించ‌నున్నాడు. ఇక అనుష్కతోనూ త్వ‌ర‌లోనే విజ‌య్ సినిమా చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. మ‌నోడి టైమ్ అలా న‌డుస్తుంది మ‌రి..! ఎంతైనా అదృష్టం అంటే అర్జున్ రెడ్డికి ప‌ట్టిన‌ట్లు ప‌ట్టాలి మ‌రి..!