లైఫ్‌లో డ్రామా ఉండాలి

Last Updated on by

జీవితంలో డ్రామా ఉండాలి. అప్పుడే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది! అంటూ త‌న‌దైన శైలిలో చెప్పాడు అర్జున్‌రెడ్డి అలియాస్ దేవ‌ర‌కొండ‌. అత‌డు న‌టించిన గీత గోవిందం ఈ ఆగ‌స్టు 15న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ గీతాఆర్ట్స్ కార్యాల‌యంలో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో పలు ఆస‌క్తిక‌ర సంగతుల్ని ముచ్చ‌టించాడు.

ఈ సినిమాలో కూడా అర్జున్‌రెడ్డిలా క‌నిపిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు అలాంటిదేం లేద‌ని అన్నాడు. అర్జున్‌రెడ్డి, గోవిందం ఒకేలా ఉండ‌రు. ఇద్ద‌రూ ప్రేమికులే. అయితే ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూర‌మైనా వెళ్లే ల‌వ‌ర్స్ వీళ్లు. అర్జున్‌రెడ్డితో గోవిందుడికి పోలిక ఉండ‌దు. ఇందులో నా పాత్ర‌ను విజ‌య్ గోవిందం అని పిల‌వాలి. విజ‌య్ అనే పిలుస్తారంతా.. అని చెప్పాడు. రెండు విభిన్న ధృవాల మ‌ధ్య కొట్లాట ఎలా ఉంటుంది? అన్న‌ది తెర‌పై రక్తి క‌ట్టిస్తుంద‌ని తెలిపారు. ఇక ప‌ర‌శురామ్ గురించి చెబుతూ .. త‌న పాత్రలో ప్ర‌తిదీ ప‌ర‌శురామ్ డిజైన్‌. త‌న న‌ట‌న‌కు క్రెడిట్ ప‌ర‌శురామ్‌కే ఇస్తాన‌ని అన్నాడు. అస‌లు ఫ్యామిలీ స్టోరీస్ చేయ‌కూడ‌ద‌న్న త‌న‌ను బ‌ల‌వంతంగా ఒప్పించి బ‌న్ని వాసు ఈ చిత్రం చేశాడ‌ని తెలిపారు. అయితే ఈ సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా ఆక‌ట్టుకుంటుంద‌ని వెల్ల‌డించాడు. సీజీ వ‌ర్క్‌లో ఆల‌స్యం వ‌ల్ల‌నే ఈ సినిమా రిలీజ్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మైంద‌ని తెలిపారు. అర్జున్‌రెడ్డి విజ‌యం త‌ర్వాత ఇంత‌కాలం వేచి చూడ‌డానికి కార‌ణం క్వాలిటీ కోస‌మేన‌ని వెల్ల‌డించాడు.

User Comments