`న‌వాబ్` నిర్మాత‌ల‌కే `స‌ర్కార్‌`

Last Updated on by

సామాజికాంశాల్ని ట‌చ్ చేస్తూ, ప్ర‌యోగాత్మ‌క పంథాలో వెళుతూనే, క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకోవ‌డం మురుగ‌దాస్ స్టైల్‌. డిఫ‌రెంట్‌ కథలతో ట్రావెల్‌ చేసే విజయ్‌కు మురుగదాస్ మ‌రోసారి అద్భుత‌మైన క‌థ‌తో సినిమా తీస్తున్నారు. విజ‌య్ హీరోగా తుపాకి, క‌త్తి వంటి విజయవంతమైన చిత్రాల త‌ర్వాత రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్ స‌ర్కార్. కీర్తి సురేష్‌, వరలక్ష్మి శరత్ కుమార్, కథానాయికలు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిథి మారన్‌ నిర్మిస్తున్నారు.

ఇటీవల నవాబ్‌తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అశోక్‌ వల్లభనేని ఈ మూవీ తెలుగు హక్కుల్ని ద‌క్కించుకున్నార‌ని తెలుస్తోంది. నవాబ్‌లాంటి సూపర్‌హిట్‌ తర్వాత మురుగదాస్‌, విజయ్‌ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ మరో మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పటి తమిళంలో విడుదలైన ఫస్ట్‌లుక్‌కి, పాటలకు స్పందన అద్భుతంగా ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహిస్తాం. దీపావళి కానుకగా నవంబర్‌ 6న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం“ అని అశోక్‌ వల్లభనేని చెప్పారు. ఈ చిత్రానికి ఏ .ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

User Comments