విజ‌య్ సేతుప‌తి మూవీ రివ్యూ

నటీనటులు : విజ‌య్ సేతుప‌తి, రాశీ ఖ‌న్నా, నివేద పెథురాజ్, నాజ‌ర్ త‌దిత‌రులు..
రిలీజ్ తేదీ: 15 న‌వంబ‌ర్ 2019
నిర్మాత: రావూరి.వి.శ్రీ‌నివాస్ (తెలుగు వెర్ష‌న్)
దర్శకత్వం: విజ‌య్ చంద‌ర్

ముందు మాట:
96, సూప‌ర్ డీల‌క్స్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ లో న‌టించాడు విజ‌య్ సేతుప‌తి. ఇటీవ‌లే మెగాస్టార్ సైరా-న‌ర‌సింహారెడ్డి చిత్రంలో వీరుడిగా కీల‌క పాత్ర‌లో న‌టించి తెలుగువారికి చేరువ‌య్యాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ క్రేజీ చిత్రాల్లో విల‌న్ గా న‌టిస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే ఇత‌ర త‌మిళ హీరోల్లానే తెలుగు మార్కెట్ పై సేతుప‌తి క‌న్నేశాడు. త‌న స్టార్ డ‌మ్ ని ఇక్క‌డా విస్త‌రించే ప్లాన్ లో ఉన్నాడు. అందులో భాగంగానే అత‌డు ద్విపాత్రాభిన‌యం చేసిన మాస్ చిత్రం `సంగ త‌మిళ్`ని తెలుగులో విజ‌య్ సేతుప‌తి పేరుతో అనువదించి రిలీజ్ చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి ఈ మాస్ చిత్రం రిలీజైంది. విశాల్ యాక్ష‌న్.. సందీప్ కిష‌న్ తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ చిత్రాల‌తో పోటీప‌డుతూ ఈ తంబీ సినిమా నేడు రిలీజ‌వుతుండ‌డంతో ఆస‌క్తి నెల‌కొంది. మాస్ స్టార్ సేతుప‌తి ఏ ల‌క్ష్యంతో అయితే తెలుగు రెజియ‌న్ లో అడుగుపెడుతున్నాడో అది నెర‌వేరిందా లేదా? అన్న‌ది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథనం అనాలిసిస్:
ఒక ప్ర‌శాంత‌మైన గ్రామం.. అక్క‌డో డార్లింగ్ లాంటి కుర్రాడు.. అత‌డంటే ప్రాణం పెట్టేసే గ్రామ‌స్తులు.. ఇంత‌లోనే ఎక్క‌డి నుంచో ఇండ‌స్ట్రీ (రాగి ప‌రిశ్ర‌మ‌) పెడ‌తాం అంటూ కార్పొరెట్ కంపెనీ రాక‌తో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అలా మంత్రి గారి కార్పొరెట్ త‌న‌ను ఎదురించిన‌ సేతుప‌తిని అత‌డి కుటుంబాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన క్ర‌మంలో రెండో సేతుప‌తి చ‌ర‌ణ్‌ ఎంట్రీ ఇస్తాడు. దాంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. విజ‌య్ సేతుప‌తి కుటుంబాన్ని హ‌త‌మార్చిన మంత్రి చంట‌బ్బాయ్ కి చ‌ర‌ణ్ (రెండో సేతుప‌తి) ఎలాంటి బుద్ధి చెప్పాడు? కాప‌ర్(రాగి) ఇండ‌స్ట్రీ వ‌ల్ల విల‌న్ల వ‌ల్ల‌ భూములు కోల్పోవాల్సిన‌ గ్రామాస్తుల‌కు అత‌డు ఎలాంటి ప‌రిష్కారం ఇచ్చాడు? అన్న‌దే బ్యాలెన్స్ సినిమా.

ఫ‌స్టాఫ్ లో క‌థేమీ లేదు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఆక‌ట్టుకుంటుంది. సెకండాఫ్ చెప్పుకోవ‌డానికి ఏదీ లేకుండా పూర్తి చెత్త‌గా తీశారు. ఫ్లాష్ బ్యాక్ ప‌ర‌మ బోరింగ్. టాలీవుడ్ ఫ్యాక్ష‌న్ చిత్రాల్లో ఇలాంటివి ఎన్నో చూసేశాం. లాజిక్ లేని సీన్లు.. ఇర్రిటేట్ చేసే స్క్రీన్ ప్లే విసుగు తెప్పిస్తుంది. హీరో విలన్ మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఏమంత ఆక‌ట్టుకోదు. చెత్త స్క్రీన్ ప్లే వ‌ల్ల హీరో పాత్ర అస్స‌లు ఎలివేట్ కాలేదు. ఒక మాస్ సినిమాకి కావాల్సిన హంగులేవీ స‌రిగా కుద‌ర‌లేద‌నే చెప్పాలి. ఒక ర‌కంగా శ్రీ‌మంతుడు, ఖైదీనంబ‌ర్ 150, విక్ర‌మార్కుడు లాంటి సినిమాల కిచిడీ తీశార‌ని చెప్పొచ్చు. ద‌ర్శ‌కుడు విజ‌య్ చంద‌ర్ ఇంత‌కుముందు రెండు డిజాస్ట‌ర్లు తీసి సేతుప‌తిని ఒప్పించడం గ్రేట్ అనే చెప్పాలి. 90ల నాటి ట్రీట్ మెంట్ తో ఇంకా సినిమాలు తీస్తుండ‌డం అత‌డికి పెద్ద మైన‌స్. ఓవ‌రాల్ గా ఒక చెత్త మాస్ సినిమా విజ‌య్ సేతుప‌తి.

నటీనటులు:
విజ‌య్ సేతుప‌తి బ్రిలియంట్ యాక్ట‌ర్.. అందులో డౌట్ ఏమీ లేదు. అయితే ఈ సినిమాలో అత‌డి పాత్ర‌ను తీర్చిదిద్దిన విధాన‌మే నీర‌సం పుట్టిస్తుంది. ఇది కేవ‌లం మాస్ ఫాలోయింగ్ కోసం చేసిన సినిమా.. అంత‌గా ఆస‌క్తి లేకుండా న‌టించాడా అనిపిస్తుంది. అందుకే సేతుప‌తి ప్ర‌య‌త్నం పూర్తిగా వృధా అయ్యింది. ఇక అత‌డి హెవీ లుక్ వ‌ల్ల హీరోయిక్ అప్పియ‌రెన్స్ క‌నిపించ‌దు. విజ‌య్ జిమ్ కి వెళ్లి కాస్త ట్రిమ్ అయితేనే తెలుగు ఆడియెన్ కి న‌చ్చే అవ‌కాశం ఉంటుంది. రాశీ ఖ‌న్నా, నివేద త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. అయితే ఆ పాత్ర‌ల్ని రాసుకున్న విధానం ఏమంత ఆక‌ట్టుకోదు. సూరి కామెడీ ట్రై చేసినా ఫెయిలైంది. నాజ‌ర్, అశుతోష్ రానా, ర‌వి కిష‌న్ సాధా సీదా పాత్ర‌ల్లోనే క‌నిపించారు.

టెక్నికాలిటీస్:
ఇందులో వివేక్ మెర్విన్ మ్యూజిక్ మాస్ యాంగిల్ ఓకే కానీ.. సెకండాఫ్ లో సుదీర్ఘ నిడివి ఉన్న మాంటేజ్ పాట‌ల వ‌ల్ల జ‌నాల‌ ఓపిక న‌శిస్తుంది. బీజీఎం లౌడ్ గా ఇర్రిటేట్ చేస్తుంది. నిర్మాణ‌విలువ‌లు పూర్. ఎడిటింగ్ ప‌ర‌మ చెత్త‌గా ఉంది. చాలా స‌న్నివేశాల్ని ట్రిమ్ చేయ‌కుండా అలా వ‌దిలేయ‌డంతో లెంగ్తీగా అనిపిస్తుంది. సెకండాఫ్ అయితే అస్స‌లు భ‌రించ‌డ‌మే క‌ష్టం. కొన్ని డైలాగులు ఓకే. క్లైమాక్స్ మ‌రీ టెర్రిబుల్.

ప్లస్ పాయింట్స్:

* సేతుప‌తిలో మాస్ యాంగిల్
* అందాల నాయిక‌లు

మైనస్ పాయింట్స్:

* తంబీ రొటీన్ స్టోరీ
* సెకండాఫ్ మ‌రీ చెత్త‌

ముగింపు:
విజ‌య్ సేతుప‌తి.. మాస్ హీరోయిజం మిస్ ఫైర్!

రేటింగ్:

1.75/5