Last Updated on by
కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా వెలిగిపోతున్నాడు విజయ్ సేతుపతి. అతడు నటించిన సినిమాన్నీ బ్లాక్ బస్టర్ల జాబితాలో చేరుతున్నాయి. నటుడిగా క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంటున్నాడు. 2018లో అతడు నటించిన అరడజను సినిమాల్లో మెజారిటీ పార్ట్ విజయాలు దక్కించుకున్నాయి. నవాబ్, సీతకత్తి వంటి చిత్రాల్లో అతడి నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సంక్రాంతి బరిలో రిలీజైన పేట చిత్రంలో సేతుపతి పాత్రకు వచ్చినంతగా వేరొక రోల్ కి ప్రశంసలు దక్కలేదు. రజనీ తర్వాత సేతుపతి పాత్రకే ప్రాధాన్యత కనిపించింది.
ప్రస్తుతం 2019 లో అతడి లైనప్ అంతే పెద్దదిగా ఉంది. సూపర్ డీలక్స్, కడైసి వివాసై, ఇదం పొరుల్ యావల్, మార్కొని మాథాయ్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా సైరా చిత్రంతో టాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు ప్రిపేరవుతున్నాడు. ఈ చిత్రంలో మెగాస్టార్ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తుండగా, విజయ్ సేతుపతి ఓబయ్య అనే కీలక పాత్రలోనూ నటిస్తున్నాడు. ఓబయ్య పాత్ర లుక్ ని తాజాగా రివీల్ చేశారు. సేతుపతి కత్తి చేతబట్టి భీకరంగా కనిపిస్తున్నాడు. ఒళ్లంతా శివభక్తుడి తరహాలో విభూతి బొట్లు కనిపిస్తున్నాయి. మొత్తానికి బర్త్ డే రోజు సైరా టీమ్ అతడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.
User Comments