కామ్రేడ్ ఎందుకీ అత్యుత్సాహం?

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టించిన `డియ‌ర్ కామ్రెడ్` ఈ నెల 26న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచాయి. విజ‌య్ కూడా వ‌రుస‌గా స‌క్సెస్ ల‌తో దూసుకోవడంతో అంచ‌నాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. ఈ సంద‌ర్భంగా ఇచ్చిన ఇంట‌ర్వూలో విజ‌య్ కాస్త అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. బాహుబ‌లి సినిమా తో పోలిక పాక్షికంగా చేసినా అంత‌క‌న్నా నేను గొప్ప అనే అర్ధం వ‌చ్చేలే ఓ వ్యాఖ్య చేసాడు. అదేంటంటే? నాలుగు భాష‌ల్లో రిలీజ్ అవుతోన్న మొట్ట మొద‌టి సినిమా డియర్ కామ్రేడ్. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ తెలుగు సినిమా క‌న్న‌డ‌లో రిలీజ్ కాలేదు. బాహుబలి కూడా కన్నడలో రిలీజ్ కాలేదు. కానీ ఈ సినిమా కన్నడలో అలాగే మిగిలిన భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది అన్నాడు.

ఇది ఓ సంచ‌ల‌నం. కొంచెం టెన్ష‌న్ కూడా ఉంది. కానీ సినిమా అవుట్ ఫుట్ చూసాక చాలా న‌మ్మ‌కంగా ఉన్నాం. ఇదొక ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. సినిమా చూశా ఒక ఎమోషన్ అండ్ ఒక ఆలోచన మిగిలిపోతుంది. సినిమాలో నా క్యారెక్టర్ గాని, అలాగే రష్మిక పాత్ర గాని ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. మా రెండు క్యారెక్టర్ ల జర్నీనే ఈ సినిమా. నచ్చిన దాని గురించి పోరాడండి అనే చెప్పే సినిమా ఇది అన్నాడు. బాలీవుడ్ లోనూ అవ‌కాశాలు వస్తున్నాయి. కానీ తెల‌గులో న‌టించ‌డానికే స‌మ‌యం స‌రిపోలేదు. మంచి క‌థ వ‌స్తే హిందీలో చేస్తా. ప్ర‌స్తుతం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, మ‌రో కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నాన‌ని, మ‌రో రెండు క‌థ‌లు లైన్ లో పెట్టాన‌ని తెలిపాడు.

Also Read: Vijay Deverakonda Turns Playboy