నితిన్ ని సెట్ చేస్తోన్న విజ‌య్ కుమార్!

Last Updated on by

యూత్ స్టార్ నితిన్ కు `ఇష్క్` త‌ర్వాత `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే`తో మ‌రో భారీ స‌క్సెస్ అందించాడు విజ‌య్ కుమార్ కొండ‌. ద‌ర్శ‌కుడిగా తొలి సినిమాతోనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాడు. ఆ కాన్ఫినెన్స్ తోనే విజయ్ కు , నాగ‌చైత‌న్య పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చాడు. అదే `ఒక లైలా కోసం`. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన సినిమా వాటిని ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. దీంతో విజ‌య్ కు మ‌రో ఛాన్స్ రాలేదు. ఇదే క్ర‌మంలో కుటుంబంలో వివాదాలు త‌లెత్త‌డంతో కొన్ని ఇబ్బందుల‌కు గుర‌య్యాడు. ఈ నేప‌థ్యంలో కొన్నాళ్ల నుంచి సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఎట్ట‌కేల‌కు ఆ స‌మ‌స్య‌ల‌న్ని ఓ కొలిక్కి వ‌చ్చాయ‌ట‌. దీంతో మ‌ళ్లీ సినిమాల‌పై క‌న్‌స‌న్‌ట్రేట్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

మ‌రోసారి నితిన్ ఇంటి గ‌డ‌ప తొక్కాడ‌ని వినిపిస్తోంది. ఇటీవ‌లే ఆయ‌న్ని క‌లిసి లవ్ స్టోరీలైన్ వినిపించాడుట‌. లైన్ న‌చ్చ‌డం…గ‌తంలో హిట్ కూడా ఇచ్చిన ద‌ర్శ‌కుడు కావ‌డంతో చేద్దామ‌ని మాటిచ్చాడుట. ప్ర‌స్తుతం నితిన్ కెరీర్ కాస్త ఇబ్బంది క‌రంగానేఉంది. అఆ త‌ర్వాత స‌రైన హిట్ లేదు. లై, ఛ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం వ‌రుస ప్లాప్ లు అందుకున్నాడు. ఆ ప్ర‌భావం మార్కెట్ పై ప‌డింది. దీంతో ఇప్పుడు స‌క్సెస్ అత్యంత అనివార్యం. అందుకే భీష్మ క‌మిట్ మెంట్ విష‌యంలో కొన్ని నెల‌లు పాటు స్త‌బ్దుగా ఉండి, బాగా ఆలోచించుకుని ఒకే చేసాడు. ఆ సినిమా గ‌నుక హిట్ అయితే విజ‌య్ కు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.