అమ్మ బ‌యోపిక్‌పై రైట‌ర్ కామెంట్‌

Last Updated on by

దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, అమ్మ జ‌య‌ల‌లిత‌పై వ‌రుస‌గా బ‌యోపిక్ లు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే నిత్యామీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా `ది ఐర‌న్ లేడి` పేరుతో ఓ బయోపిక్ సెట్స్ పై ఉంది. ఆ క్ర‌మంలోనే కంగ‌న టైటిల్ పాత్ర‌లో జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని విబ్రి మీడియా అధినేత‌, ఎన్టీఆర్ బ‌యోపిక్ స‌హ‌నిర్మాత విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. బాహుబ‌లి రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తున్నారు.

తాజాగా ఈ బ‌యోపిక్ కి సంబంధించి స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్రసాద్ త‌న‌లోని ఆందోళ‌న‌ను బ‌య‌ట‌కు వ్య‌క్తం చేశారు. అమ్మ జ‌య‌ల‌లిత జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆమె జీవితాన్ని ర‌క‌ర‌కాల సంఘ‌ట‌న‌ల స‌మాహారంగా చూడాలి. ర‌క‌ర‌కాల ద‌శ‌ల్ని ప‌రిశీలించి ఎక్క‌డ క‌థ ఎంచుకోవాలి? అన్న‌ది ఎంతో ఛాలెజింగ్ అనే చెప్పాలి. జ‌య‌ల‌లిత జీవిత‌క‌థ‌ను చూపించేప్పుడు ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఏదైనా తేడా జ‌రిగితే అమ్మ అభిమానులు అస్స‌లు ఊరుకోరు. క్ష‌మించ‌నే క్ష‌మించ‌రు అని అన్నారు. అంటే ఈ బ‌యోపిక్ విష‌యంలో విజయేంద్రుడి ముందు అతి పెద్ద స‌వాల్ ఉంద‌నే అర్థ‌మ‌వుతోంది. ఇక జ‌య‌ల‌లిత‌కు త‌మిళ‌నాడులో ఉన్న వీరాభిమానులతో చాలా ప్ర‌మాదాలే పొంచి ఉన్నాయ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అంట ప‌ద్మావ‌త్ కి క‌ర్ణి సేన‌ల నుంచి ఎదురైన థ్రెట్ లానే అమ్మ జ‌య‌లలిత బ‌యోపిక్ కి కొన్ని తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్నమాట‌. ఈ చిత్రాన్ని త‌మిళంలో త‌లైవి పేరుతోనూ హిందీలో జ‌య పేరుతోనూ తెర‌కెక్కించ‌నున్నారు. ఏ.ఎల్.విజ‌య్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Also Read: Ugadi Special From Maharshi Team

User Comments