మెర్స‌ల్ దెబ్బ‌కు బాహు..బ‌లి

బాహుబ‌లి రికార్డులు బ‌ద్ధ‌లు కొట్ట‌డం అంటే చిన్న విష‌యం కాదు. చాలామంది హీరోలు వ‌చ్చి కూడా ఆ రికార్డులు క‌దిలించలేక కామ్ గా వెళ్లిపోయారు. మొన్న అజిత్ కూడా వివేగంతో ఈ రికార్డుల‌ను ఏమీ చేయ‌లేక‌పోయాడు. కానీ ఇప్పుడు విజ‌య్ క‌దిలిస్తున్నాడు. ఈ చిత్రం త‌మిళ‌నాట సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. తొలిరోజు చెన్నైలో బాహుబ‌లి 2 రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేసింది మెర్స‌ల్. తొలిరోజే అక్క‌డ కోటిన్న‌రకు పైగా వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇది అక్క‌డ ఆల్ టైమ్ రికార్డ్. రెండోరోజు కూడా కోటి 47 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. తొలిరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 47 కోట్ల గ్రాస్ రాగా.. ఒక్క తమిళనాడులోనే 23 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది ఈ చిత్రం.

ఈ విష‌యంలో బాహుబ‌లి 2 కూడా చాలా వెన‌క‌బ‌డి ఉంది. అక్క‌డ బాహుబ‌లి 2 తొలిరోజు 13 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఇప్పుడు 10 కోట్ల తేడాతో ఆ రికార్డ్ బ‌ద్ధ‌లు కొట్టేసింది మెర్స‌ల్. ఇక ఇప్పుడు ఓవ‌రాల్ వ‌సూళ్ల‌లో బాహుబ‌లి 2ని టార్గెట్ చేసాడు విజ‌య్. ప్ర‌స్తుతం త‌మిళ‌నాట బాహుబ‌లి 2 జెండానే ఎగురుతుంది. అక్క‌డ 110 కోట్లతో రోబో రికార్డుల‌ను కూడా తిర‌గ‌రాసాడు ప్ర‌భాస్. దాంతో విజ‌య్ ఈ రికార్డుల‌పై క‌న్నేసాడు. క‌బాలి.. వివేగంకు కూడా సాధ్యం కాని రికార్డుల వైపు మెర్స‌ల్ అడుగులు ప‌డుతున్నాయి. ఐదు రోజుల వీకెండ్ ఉండ‌టం.. సినిమాకు పాజిటివ్ టాక్ ఉండ‌టంతో మెర్స‌ల్ క‌చ్చితంగా బాహుబ‌లి 2ని బీట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికి చూడాలిక‌.. మెర్స‌ల్ దెబ్బ‌కు బాహు.. బ‌లైపోతుందో లేదో..?