అన్నీ మావ‌య్యేనా మెగా అల్లుడా?

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ న‌టించిన విజేత రేపు రిలీజ్‌కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. క‌ళ్యాణ్ ట్రైల‌ర్ల‌లో ఆక‌ట్టుకున్నాడు. మెగా అల్లుడి లుక్‌ ఇంప్రెస్సివ్ అన్న టాక్ వినిపించింది. ఎలానూ రేపు రిలీజ్ సంద‌ర్భంగా క‌ళ్యాణ్‌దేవ్ పాత్రికేయుల‌తో మాట్లాడాడు. ఫిలింఛాంబ‌ర్ లో జ‌రిగిన‌ ఇంట‌ర్వ్యూలో క‌ళ్యాణ్‌దేవ్ మాట్లాడుతూ – ఈ సినిమాకి చ‌క్క‌ని క‌థ‌తో వ‌చ్చాడు రాకేష్‌. తొలుత లైన్ విని చిరంజీవి మావ‌య్య గారు ఓకే చెప్పారు. అటుపై క‌థ రెడీ అయ్యాక స‌ల‌హాలిచ్చారు. నేను నిమిత్త‌మాత్రుడినే.. అంతా మావ‌య్యే చూసుకున్నారు. ఆన్ లొకేష‌న్ వెళ్లాక అక్క‌డ అంద‌రూ స్నేహితుల‌య్యారు. నా ద‌ర్శ‌కుడు రాకేశ్ శశి, కెమెరా డిపార్ట్‌మెంట్, నిర్మాత‌లు అంతా స్నేహంగా ఉండ‌డం వ‌ల్ల న‌టించ‌డానికి ఎక్క‌డా బెరుకు రాలేదు.

మెగా ఫ్యామిలీ నుంచి హీరో అన్న ఒత్తిడి కూడా నాపై లేదు. ఆన్ లొకేష‌న్ ప్లెజ‌ర్‌గానే ఫీల‌య్యాను. నో ప్రెజ‌ర్.. ఓన్లీ ప్లెజ‌ర్! అనీ క‌ళ్యాణ్ అన్నారు. అలాగే మావ‌య్య టైటిల్ విజేతను ఫైన‌ల్ చేయ‌డానికి తొలుత ఎంత‌గానో ఆలోచించాల్సి వ‌చ్చింది. విజేత అని అంటే నెగెటివ్‌గా ఇంపాక్ట్ ప‌డుతుంద‌ని భ‌య‌ప‌డినా క‌థ డిమాండ్ మేర‌కు చివ‌రికి అదే ఫైన‌ల్ చేశారు. రేపు రిలీజ్ అన‌గా ఇవాళ పోస్ట‌ర్లు, హోర్డింగులు చూసుకుంటే ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. అంద‌రూ ఆశిస్తార‌నే భావిస్తున్నా… అనీ క‌ళ్యాణ్ దేవ్ అన్నారు.

User Comments