బ‌న్ని అంత పెద్ద షాకిచ్చాడా?

Last Updated on by

నా పేరు సూర్య ఇచ్చిన షాక్ నుంచి బ‌న్ని ఇంకా తేరుకోలేదు. ర‌చ‌యిత వ‌క్కంతం వంశీని ద‌ర్శ‌కుడిగా ప్ర‌మోట్ చేస్తూ బ‌న్ని పెద్ద సాస‌హ‌మే చేశాడు. అయితే ఈ సాహసం బెడిసికొట్టింది. ఎన్‌పీఎస్ ఊహించ‌ని రీతిలో ఫ్లాప‌వ్వ‌డంతో బ‌న్ని ఆ త‌ర్వాత చాలానే ఆలోచించుకోవాల్సి వ‌చ్చింది. వ‌రుస స‌క్సెస్‌ల‌తో జోరుమీద ఉన్న త‌న‌కు ఊహించ‌ని ఈ ఫ్లాప్ ఎన్నో సందేహాల్ని సంశ‌యాల్ని ఉంచి వెళ్లింది. అందుకే స్క్రిప్టు విష‌యంలో, ద‌ర్శ‌కుడి విష‌యంలో ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తున్నాడు బ‌న్ని.

నిన్న‌మొన్న‌టివ‌ర‌కూ 24, మ‌నం, హ‌లో వంటి వైవిధ్య‌మైన చిత్రాల్ని అందించిన విక్ర‌మ్‌.కె.కుమార్‌తో ఓ క‌థ విష‌య‌మై ట్రావెల్ అయ్యాడు. ఆరంభం విక్ర‌మ్ వ‌ద్ద‌నుకుని, మ‌ళ్లీ అత‌డితో క‌థాచ‌ర్చ‌ల ప‌రంగా ట్రావెల్ కావ‌డంతో ఇక అత‌డినే బ‌న్ని ఫిక్స‌య్యాడ‌ని భావించారంతా. కానీ ఇంత‌లోనే ఏమైందో మ‌రో ఊహించ‌ని షాక్‌. విక్ర‌మ్‌.కె వినిపించిన క‌థ‌ను, అత‌డిని ప‌క్క‌న పెట్టి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ప‌ని చేసేందుకే బ‌న్ని ఫిక్స‌య్యాడ‌న్న మాట వినిపిస్తోంది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ `అర‌వింద స‌మేత‌` చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి చేసి వ‌చ్చే వ‌ర‌కూ బ‌న్ని వేరే ఏ ప్రాజెక్టును క‌మిట‌య్యే ఆలోచ‌న‌లో లేర‌ట‌. దీంతో విక్ర‌మ్‌ని సైడేసిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఇది విక్ర‌మ్‌.కె అభిమానులకు ఊహించ‌ని షాక్ అనే చెప్పాలి. అంద‌రికీ షాకిచ్చే క‌రెంట్ తీగ‌ల‌కే షాకిచ్చే నిర్ణ‌యం బ‌న్ని తీసుకున్నాడ‌న్న‌మాట‌!!

User Comments