మ‌ళ్లీ అలాగే ఉందిగా సామి..!

Last Updated on by

కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు కొత్త‌ద‌నం అనేది అస్స‌లు ప‌డ‌దు. వాళ్లేం చేసినా రొటీన్ కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది. అలాంటి ద‌ర్శ‌కుల్లో హ‌రి ముందు వ‌ర‌స‌లో ఉంటాడు. ఈయ‌న త‌న సినిమాల్లో క‌థ ఎప్పుడూ పాత‌దే ఉండేలా చూసుకుంటాడు. క‌థ కంటే క‌థ‌నాన్ని ఎక్కువ‌గా న‌మ్ముకుంటాడు హ‌రి. అంటే స్క్రీన్ ప్లే అన్న‌మాట‌.. కెమెరాతో పాటే స్క్రీన్ ప్లే కూడా ప‌రుగులు పెడుతుంది. అందుకే రొటీన్ సినిమాలతో కూడా బ్లాక్ బ‌స్ట‌ర్స్ కొడ‌తాడు హ‌రి. ఇప్పుడు ఈయ‌న విక్ర‌మ్ హీరోగా సామి స్క్వేర్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో 15 ఏళ్ల కింద వ‌చ్చిన సామి సినిమాకు ఇది సీక్వెల్. తాజాగా ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌లైంది.

ఇది చూసిన త‌ర్వాత హ‌రి ఏ మాత్రం మార‌లేద‌ని మ‌రోసారి అర్థ‌మైపోయింది. ఎందుకంటే రెండేళ్ల కింద సూర్య‌తో రిలీజ్ చేసిన సింగం 3 మోష‌న్ పోస్ట‌ర్ కూడా అచ్చంగా ఇలాగే ఉంది. ఇప్పుడు ఇదే చేసాడు హ‌రి. అయితే సినిమా మాత్రం ఖచ్చితంగా కొత్త‌గా ఉంటుందంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం ఇదే ఏడాది విడుద‌ల కానుంది. ఇప్పుడు వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న విక్ర‌మ్ కెరీర్ కు సామి స్క్వేర్ కీల‌కంగా మారింది. ఖచ్చితంగా ఈ చిత్రం త‌ను కోరుకున్న విజ‌యాన్ని ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. మ‌రి.. అప్పుడు సామితో విక్ర‌మ్ ను స్టార్ గా మార్చేసిన హ‌రి.. ఇప్పుడు సీక్వెల్ తో ఏం చేస్తాడో..?

User Comments