సామి అన్నారు.. సింగం వచ్చింది

ఇప్పుడు సామి స్క్వేర్ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత వ‌చ్చే అనుమానం ఇదే. విక్ర‌మ్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కిస్తున్నాడు. ఈయ‌న త‌న సినిమాల‌న్నింటికీ ఒకే క‌థ‌ను మార్చి మార్చి ఎంచుకుంటాడు. ముఖ్యంగా పోలీస్ స్టోరీలు అయితే అన్ని ఒకేలా ఉంటాయి. సింగం సిరీస్ నుంచి ఆ మ‌ధ్య ఆయ‌న చేసిన సామి సినిమా వ‌ర‌కు అన్నీ ఒకేలా అనిపిస్తుంటాయి. ఇప్పుడు కూడా సామి స్క్వేర్ తీస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ మ‌ధ్య కాలంలో ఒక్క హిట్ కూడా లేని విక్ర‌మ్ కు ఇప్పుడు సామి సీక్వెల్ కీల‌కంగా మారింది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే కొత్త‌ద‌నం అయితే ఏ మాత్రం క‌నిపించ‌ట్లేదు కానీ హ‌రి మాత్రం త‌న మార్క్ తో కుమ్మేస్తానంటున్నాడు.

పాత క‌థే అయినా స్క్రీన్ ప్లేతో ర‌ప్ఫాడిస్తానంటున్నాడు హ‌రి. ఈ చిత్రంలో బాబీ సింహా విల‌న్ గా న‌టిస్తుండ‌టం విశేషం. కీర్తిసురేష్ హీరోయిన్. ట్రైలర్ చూసినంత సేపు సింగం సినిమానే గుర్తొస్తుంది. విక్ర‌మ్ కూడా ఓ టైమ్ లో సూర్య మాదిరే క‌నిపిస్తున్నాడు. మ‌రి సింగం సిరీస్ మ‌త్తు ఎక్కువైపోయి అలా అనిపిస్తుందా.. లేదంటే నిజంగానే అలాంటి క‌థ‌తోనే మ‌ళ్లీ హ‌రి వ‌స్తున్నాడా అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఒక్క‌టైతే నిజం.. ఇప్పుడు విక్ర‌మ్ ఉన్న ప‌రిస్థితుల్లో ఖచ్చితంగా సామి సీక్వెల్ హిట్ కావాలి లేదంటే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారిపోతుంది.