విధేయ రామ టీమ్‌లో గొడ‌వలెందుకు?

Last Updated on by

ఈ సంక్రాంతి బ‌రిలో నాలుగు సినిమాలు రిలీజైతే, అందులో ఎఫ్ 2 మాత్ర‌మే ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇత‌ర సినిమాల‌న్నీ ఫ్లాపులుగా నిలిచాయి. అందులో రామ్ చ‌ర‌ణ్ – బోయ‌పాటి- దాన‌య్య కాంబినేష‌న్ మూవీ `విన‌య విధేయ రామ‌` డిజాస్ట‌ర్ అయ్యి, ఏకంగా 30 కోట్ల న‌ష్టం తెచ్చింద‌ని తేలింది. ప్ర‌స్తుతం దీనిపై డిస్ట్రిబ్యూట‌ర్ల‌లో తీవ్ర‌మైన ఆవేద‌న నెల‌కొన‌డంతో నిర్మాత – ద‌ర్శ‌కుడి మ‌ధ్య క‌ల‌త‌లు త‌ప్ప‌లేద‌ని తెలుస్తోంది.

పంపిణీదారుల న‌ష్టాల్ని స‌గం మేర అంటే 15కోట్ల‌కు భ‌ర్తీ చేసేందుకు నిర్మాత దాన‌య్య చొర‌వ తీసుకున్నార‌ట‌. త‌న హీరో రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటితో ఈ న‌ష్టాల్ని స‌గం భ‌రిద్దామ‌ని అడిగార‌ట‌. ఆ క్ర‌మంలోనే రామ్ చ‌ర‌ణ్ రూ.5కోట్లు వెన‌క్కి ఇచ్చేశార‌ని, అయితే బోయ‌పాటి మాత్రం రూ.5కోట్లు వెన‌క్కి ఇచ్చేందుకు స‌సేమిరా అన్నార‌ని తెలుస్తోంది. న‌ష్టాల భ‌ర్తీ విష‌యంలో నిర్మాత‌తో బోయ‌పాటి ఏకీభ‌వించ‌లేద‌ట‌. దీంతో దాన‌య్య‌తో గొడ‌వ‌య్యింద‌ని ఆన్ సైట్ చూసిన ఓ వ్య‌క్తి లీకివ్వ‌డంతో మొత్తం వైర‌ల్ అయ్యింది. అయితే దర్శకుడిగా పారితోషికం తీసుకుని సినిమా చేసే తాను నిర్మాతతో సమానంగా ఎలా నష్టపరిహారం ఇవ్వాలని బోయ‌పాటి ప్ర‌శ్నించార‌ట‌. ఆ క్ర‌మంలోనే దానయ్య‌తో మాటా మాటా పెర‌గ‌డం, అటుపై పెద్ద‌లైన దిల్ రాజు, ఎన్ వీ ప్ర‌సాద్ వంటి వారు జోక్యం చేసుకోవ‌డం .. త‌దిత‌ర ప‌రిణామాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ గొడ‌వ‌లో ఫైనల్ గా ఏం తేల్చార‌న్న‌ది తెలియాల్సి ఉంది. బోయ‌పాటి ప్ర‌స్తుతం బాల‌య్య‌తో సినిమా కోసం స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఆర్.ఆర్.ఆర్ తో బిజీ. దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Related Posts