Last Updated on by
సంక్రాంతి సినిమాల్లో భారీ అంచనాల నడుమ రిలీజైన `వినయ విధేయ రామ` బాక్సాఫీస్ వద్ద విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో పంపిణీదారులకు భారీగానే నష్టాలు తప్పడం లేదని తెలుస్తోంది. అయితే ఈ నష్టాల్ని భర్తీ చేసేందుకు డివివి సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టనుంది? అన్న దానికి ఇదిగో ఇదే సమాధానం.
`వినయ విధేయ రామ` తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కుల కోసం యువి సంస్థ ఏకంగా 72 కోట్లు వెచ్చించింది. అయితే ఏపీ, నైజాం నుంచి వీవీఆర్ చిత్రం కేవలం 56కోట్ల మేర షేర్ మాత్రమే రాబట్టింది. అంటే మిగతా మొత్తం అంతా నష్టమేనని తెలుస్తోంది. ఈ నష్టాల నుంచి పంపిణీదారును ఆదుకునేందుకు డివివి దానయ్య రూ.5కోట్ల మేర యువి క్రియేషన్స్ కి వెనక్కి ఇస్తున్నారట. అలాగే అమెరికా పంపిణీదారుడికి తీవ్రంగానే నష్టాలు తప్పలేదు. మరీ దారుణంగా 250 కె డాలర్లు మాత్రమే ఓవర్సీస్ నుంచి వెనక్కి రావడంతో ఆ నష్టం బాగానే ఉందిట. దీంతో ఇప్పటికే దానయ్య రూ.50లక్షలు ఓవర్సీస్ పంపిణీదారుడికి ఇచ్చారు. మరో 50లక్షల సాయానికి ముందుకొచ్చారట. గత ఏడాది ఇదే తరహాలో అజ్ఞతవాసి నష్టాల్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బర్తీ చేసిన సంగతి తెలిసిందే.
User Comments