టీజ‌ర్‌: మాస్ విధేయ రామా

Last Updated on by

మ‌రో 24గంట‌ల్లో `విన‌య విధేయ రామా` టీజ‌ర్ వ‌చ్చేస్తోంది అన్న గ్రీన్‌ సిగ్న‌ల్ డివివి సంస్థ నుంచి రాగానే మెగా ఫ్యాన్స్ అలెర్ట‌యిపోయారు. ఈ క్ష‌ణం కోస‌మే వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నామంటూ బోయ‌పాటి పైనా ఫైర‌య్యారు సామాజిక మాధ్య‌మాల్లో. అంద‌రూ వ‌స్తున్నా మా బాస్ రాలేదేంటి? అన్న టెన్ష‌న్ మెగా ఫ్యాన్స్‌లో ఎప్ప‌టినుంచో ఉంది. అయితే అన్నిటికీ తెర దించుతూ తొలుత ఫ‌స్ట్‌లుక్‌తో బ‌రిలో దిగిన చ‌ర‌ణ్- బోయ‌పాటి బృందం ఆ అంచ‌నాల్ని పీక్స్ కి చేర్చే టీజ‌ర్‌ని తాజాగా రిలీజ్ చేశారు.

`విన‌య విధేయ రామా`.. ఈ టైటిల్‌కి ఆ టీజ‌ర్ కి ఏమాత్రం సింక్ లేదు. టైటిల్ ఎంత క్లాస్‌గా ఉందో చ‌ర‌ణ్ అప్పియ‌రెన్స్ అంతే మాస్ గా ఉంది. బ‌హుశా అన్న‌ల‌ను శ‌త్రువు ముందు మొన‌గాళ్లుగా నిల‌బెట్టే త‌మ్ముడి క‌థ కాబ‌ట్టి, విన‌యంగా.. విధేయంగా ఉండే రామ్ అని టీజ‌ర్‌లో చెప్ప‌క‌నే చెప్పారు. ఎంచుకున్న క‌థ‌కు టైటిల్ యాప్ట్ అని టీజ‌ర్‌లో చ‌ర‌ణ్ డైలాగులు చెబుతున్నాయి. చాలా గ్యాప్ త‌ర్వాత చ‌ర‌ణ్ మ‌ళ్లీ మునుప‌టిలానే మ‌రో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని సెల‌క్ట్ చేసుకున్నాడ‌ని ఈ టీజ‌ర్ క్లారిటీనిచ్చింది. టీజ‌ర్ లో బోయ‌పాటి త‌ర‌హా మెరుపులు యాక్ష‌న్ ఆక‌ట్టుకుంది. “అన్నాయ్.. వీడిని చంపేయాలా? భ‌య‌పెట్టాలా..? భ‌య‌పెట్టాలంటే 10నిమిషాలు చంపేయాంటే పావుగంట ఏదైనా ఓకే.. సెల‌క్ట్ చేసుకో.. “ ఈ ఒక్క డైలాగ్‌లోనే మీనింగ్ దాగి ఉంది. చ‌ర‌ణ్ న‌టించిన గ‌త చిత్రం `రంగ‌స్థ‌లం`తో పోలిస్తే .. ఈ సినిమాలో సంథింగ్ ఏదైనా ఉంటుందా? అన్న‌ది చెప్ప‌లేం. బోయ‌పాటి మార్క్ మాస్ యాక్ష‌న్ ఎలిమెంట్స్ అన్నిటినీ డామినేట్ చేస్తున్నాయ‌ని టీజ‌ర్ చెబుతోంది. బీ, సీ కేంద్రాల్లో ఆడియెన్‌కి మాత్రం పండ‌గ చేసే సినిమా ఇద‌ని భావించ‌వ‌చ్చు.
రేయ్ బండి అప్ప‌ల‌సామి అయితే ఏంట్రా..? ఇక్క‌డ రామ్ .. రామ్‌ కోటి ద‌ళాల్‌.. అంటూ స‌వాల్ విసిరాడు క‌దా!! ఇలా స‌వాల్ విసిరేవాళ్లు మాస్‌కి క‌నెక్ట‌యిపోవ‌డం చాలా ఈజీ. బోయ‌పాటి మ‌రోసారి అదే ఫార్ములాని అనుస‌రించాడు. రాక్‌స్టార్ దేవీశ్రీ సాలిడ్ ఆర్‌.ఆర్ ఈ టీజ‌ర్‌కి కుదిరింది. అత‌డు సినిమాకి ప్ల‌స్ అవుతాడ‌న‌డంలో సందేహం లేదు. మాస్ విధేయ రామా అని ఇప్ప‌టికి జ‌నం ఫిక్స‌వ్వాల్సిందే.

User Comments