విన‌య విధేయ రామా సందేశం

రామ్‌చ‌ర‌ణ్ – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న `విన‌య విధేయ రామా` ప్ర‌స్తుతం మెగాభిమానుల్లో హాట్ టాపిక్. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో రిలీజ‌వుతున్న భారీ మాస్ యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ చిత్రం. చెర్రీ, బోయ‌పాటి – దాన‌య్య టీమ్ రాజీ లేకుండా శ్ర‌మిస్తోంది.

ఇప్ప‌టికే పోస్ట‌ర్లు, టీజ‌ర్ ఆక‌ట్టుకున్నాయి. తాజాగా దేవీశ్రీ స్వ‌ర‌ప‌రిచిన తందానా తందానా లిరిక‌ల్ వీడియోని దాన‌య్య మీడియా సామాజిక మాధ్య‌మాల్లో మెగాభిమానుల‌కు షేర్ చేసింది. ఈ వీడియోలో కుటుంబ అనుబంధాలు ఆక‌ట్టుకున్నాయి. చ‌ర‌ణ్ – ఆర్య‌న్- ప్ర‌శాంత్ బ్ర‌ద‌ర్స్ దేవుడి గుడిలో దేవునికి మొక్కి.. ప్ర‌సాదాలు పంచుకుంటున్న దృశ్యం ఆక‌ట్టుకుంది. ఉన్న‌దానితోనే ఆనందం.. స్వేచ్ఛ‌గా..స్వ‌తంత్రంతో కుటుంబంతో హాయిగా జీవించాలి.. అన్న‌దే విన‌య‌విధేయరాముని సందేశం అని దాన‌య్య టీమ్ కోట్ చేసింది. దేవీశ్రీ ట్యూన్ ఆక‌ట్టుకుంది.