శీనూకి విన‌య‌న్న ఆశీస్సులు

Last Updated on by

అరే అప్పుడే నాలుగేళ్ల‌యిపోయిందా? శీనూ ఎదిగేస్తున్నాడు వేగంగా. అత‌డిలో ఎంతో ప‌రిణ‌తి క‌నిపిస్తోంది. పెద్ద స్టార్ అవ్వాలి అంటూ బెల్లంకొండ శ్రీ‌నుని ఆశీర్వ‌దించారు వి.వి.వినాయ‌క్‌. శ్రీ‌ను ఇప్పుడు నాలుగు సినిమాల చిన్నోడు. బాల‌కుడే అయినా యాక్ష‌న్ స్టార్‌గా ఎదిగేసేందుకు పెద్ద స్కెచ్ వేశాడు. ఇప్పుడు విన‌య్ ఆశీస్సులు అందించారు కాబ‌ట్టి సాక్ష్య ంతో ఆశించిన‌ది ద‌క్కించుకుంటాడ‌నే భావిద్దాం.

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌- పూజా హెగ్డే జంట‌గా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వ ంలో అభిషేక్ నామ నిర్మించిన సాక్ష్య ం ఈనెల 27న రిలీజ‌వుతోంది. సెన్సార్ పూర్త‌యింది. యుఎ సర్టిఫికెట్ ఇచ్చింది. నేడు రిలీజ్ వేళ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ – అల్లుడుశీను రిలీజ్ అయి నాలుగేళ్ళు అయిందంటే నమ్మలేక‌పోతున్నా. నిన్ననే షూటింగ్ చేసినట్లుంది. సినిమా సినిమాకి సాయిలో ప‌రిణ‌తి క‌నిపిస్తోందని ప్ర‌శంసించారు. విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయ‌ని, సినిమా రిచ్‌గా, గ్రాండ్ గా తీశార‌ని విన‌య్ కాంప్లిమెంట్ ఇచ్చారు.

User Comments