యాక్షన్ నెవ్వ‌ర్ బిఫోర్-విశాల్‌

Vishal-Tamanna's Action Movie Review & Rating

మాస్‌ హీరో విశాల్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ `యాక్షన్‌`. `హుషారు, ఇస్మార్ట్‌ శంకర్‌,గద్దలకొండ గణేష్‌,రాజుగారిగది3 వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై యాక్షన్‌ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా మాస్ హీరో విశాల్ మాట్లాడుతూ -“యాక్షన్ మూవీ నవంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. సుందర్. సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని తెలుగులో శ్రీకార్తికేయ సినిమాస్‌ బేనర్ పై శ్రీనివాస్ ఆడెపు చాలా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్. విజువల్ ట్రీట్ గా ఉండబోతుంది. నా కెరీర్ లో ఎక్కువ యాక్షన్ సీక్వెన్సులు ఉన్న మూవీ ఇదే. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. నవంబర్ 15న ప్రతి ఒక్కరూ `యాక్షన్` మూవీని థియేటర్లో చూడండి“ అన్నారు. ఐశ్వర్య లక్ష్మీ, ఆకాంక్ష పూరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌, నిర్మాత: శ్రీనివాస్‌ ఆడెపు, దర్శకత్వం: సుందర్ సి.