బ‌న్నీకి రుణ‌ప‌డిపోయిన విశాల్.. 

 
విశాల్ ఏంటి.. బ‌న్నీకి రుణ‌ప‌డిపోవ‌డం ఏంటి..? ఇద్ద‌రూ ఓ ఇండ‌స్ట్రీ కూడా కాదు క‌దా.. ఇదెక్క‌డి లింక్ అనుకుంటున్నారా..? కానీ ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. విశాల్ త‌మిళ్ హీరోనే కావ‌చ్చు గానీ ఆయ‌నతో ఇప్పుడు సినిమాకు క‌మిటైన ద‌ర్శ‌కుడికి బ‌న్నీకి లింక్ ఉంది. లింగుస్వామితో విశాల్ త‌ర్వాతి సినిమా క‌న్ఫ‌ర్మ్ అయింది. ఇప్పుడు ముహూర్తం కూడా పెట్టేసారు. ఇదిలా క‌న్ఫ‌ర్మ్ అయిందంటే దానికి కార‌ణం బ‌న్నీ. ఎందుకంటే విశాల్ కంటే ముందు బ‌న్నీతోనే లింగుస్వామి సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. అనుకోని కార‌ణాల‌తో బ‌న్నీ-లింగుస్వామి ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో ఇప్పుడు వేరే ఛాన్స్ లేక‌.. విశాల్ సినిమాకు క‌మిట‌య్యాడు లింగుస్వామి.
 
విశాల్ తో పందెంకోడి సీక్వెల్ చేస్తాన‌ని గ‌తంలోనే అనౌన్స్ చేసాడు ద‌ర్శ‌కుడు లింగుస్వామి. అయితే అనుకోని కార‌ణాల‌తో ఈ ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతూనే ఉంది. ఇప్పుడు స‌డ‌న్ గా మ‌ళ్లీ సీన్ లోకి వ‌చ్చింది పందెంకోడి 2. ఈ చిత్ర ఓపెనింగ్ కూడా చెన్నైలో జ‌రిగింది. సెప్టెంబ‌ర్ లోనే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టిస్తుంది ఈ చిత్రంలో. ఆ మ‌ధ్య లింగుస్వామితో గొడ‌వ ప‌డి పందెంకోడి 2 సినిమాకు నో చెప్పాడు విశాల్. కానీ ఏమైందో ఏమో గానీ చివ‌రికి ఈ కాంబినేష‌న్ మ‌ళ్లీ ప‌ట్టాలెక్కింది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి పందెంకోడి త‌ర‌హాలోనే సీక్వెల్ కూడా హిట్ అవుతుందా..?