లేటైనా లేటెస్ట్ గా వ‌చ్చిన విశాల్..

Last Updated on by

ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాద‌న్న‌య్యా.. క‌లెక్ష‌న్లు వ‌చ్చాయా లేదా అనేది కావాలి. ఇప్పుడు విశాల్ చేసింది కూడా ఇదే. మే 11నే త‌మిళ‌నాట ఇరుంబు తిరై అంటూ వ‌చ్చాడు ఈ హీరో. అక్క‌డ ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్. కానీ తెలుగులో మాత్రం అభిమ‌న్యుడును మూడు వారాలు హోల్డ్ చేసాడు. దానికి కార‌ణం మంచి విడుద‌ల తేదీ దొర‌క‌డం కోస‌మే. నిజానికి మే 18తో పాటు 24 కూడా బాగానే ఉన్నా మ‌హాన‌టి దూకుడు ఉంది. పైగా నేల‌టికెట్ తో పాటు మ‌రో సినిమా కూడా ఉంది. దాంతో జూన్ 1 వ‌ర‌కు ఆగాడు. దానికి ప్ర‌తిఫ‌లం ఇప్పుడు అందుకున్నాడు ఈ హీరో.

అభిమ‌న్యుడు కంటెంట్ పై ఉన్న న‌మ్మ‌కంతో సినిమాను తెలుగులో త‌న స్నేహితుల‌తో క‌లిసి విడుద‌ల చేసాడు ఈ హీరో. తొలిరోజే ఈ చిత్రానికి టాక్ సూప‌ర్ గా వ‌చ్చింది. తొలి వారంలోనే ఈ చిత్రం 12 కోట్ల గ్రాస్.. 7.5 కోట్ల షేర్ వ‌చ్చింది. ఓ డ‌బ్బింగ్ సినిమాకు ఇంత స్థాయిలో వ‌సూళ్లు రావ‌డం నిజంగా విచిత్ర‌మే. కొన్నేళ్లుగా విశాల్ సినిమాకు టాక్ బాగానే వ‌చ్చినా.. అప్పుడు ఉన్న పోటీ వ‌ల్ల ప్ర‌తీసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొడుతూనే ఉన్నాడు. కానీ ఈ సారి మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. త‌మిళ్ కంటే మూడు వారాల త‌ర్వాత తెలుగులో వ‌చ్చినా కూడా సూప‌ర్ హిట్ కొట్టాడు. లేట్ అయినా లేటెస్ట్ గా వ‌చ్చి ఆఫీస‌ర్.. రాజుగాడుల‌ను ప‌డుకోబెట్టి తాను పైకి లేచాడు ఈ అభిమ‌న్యుడు.

User Comments