బ‌రిలో పందెంకోడి 2

Last Updated on by

విశాల్ న‌టించిన పందెంకోడి (2002) (సందెకోజి -త‌మిళ్‌) ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా తెలుగు, త‌మిళ్‌లో బంప‌ర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌ మీరాజాస్మిన్ క‌థానాయిక‌గా న‌టించింది. విశాల్ కెరీర్ పెర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ ఇది. ఆరంగేట్ర‌మే బ్లాక్‌బ‌స్ట‌ర్ సాధించి, అటుపై కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా అత‌డి రేంజు స్కైని ట‌చ్ చేస్తోందిప్పుడు. విశాల్ ఫిలింఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ స్థాపించి, అందులో అతడు న‌టిస్తూ సినిమాలు నిర్మిస్తున్నాడు. అలా లింగుస్వామితో క‌లిసి ఇప్పుడు `పందెంకోడి 2` (సందెకోజి 2) తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో విశాల్ మునుప‌టి కంటే చురుకైన పందెంకోడిలా క‌నిపించ‌బోతున్నాడ‌న్న స‌మాచారం ఉంది.

ఈ సోమ‌వారం (ఆగ‌స్టు 20) తొలి సింగిల్‌ని లాంచ్ చేస్తూ ప్ర‌చారంలో దూకుడు పెంచేందుకు విశాల్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. తొలిగా `సందెకోజి 2` సింగిల్ వ‌స్తోంది. అంటే అటుపై తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోషన్‌లో అంతే జోరు పెంచనున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమా పీఆర్‌వో బీఏ రాజు ఆ మేర‌కు ట్విట్ట‌ర్‌లో వివ‌రాలందించారు. యాక్ష‌న్ సినిమాల్లోనే ట్రెండ్ క్రియేట్ చేసిన `పందెంకోడి 2` విశాల్ కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుంద‌ని త‌మిళ‌నాట చెప్పుకుంటున్నారు. అభిమ‌న్యుడు చిత్రంతో బంప‌ర్ హిట్ కొట్టిన విశాల్ ప్ర‌స్తుతం దూకుడుమీదున్నాడు. అటు త‌మిళ్‌, ఇటు తెలుగు రెండు చోట్లా పందెంకోడి 2 చిత్రాన్ని అత్యంత భారీగా రిలీజ్ చేయాల‌న్న సన్నాహ‌కాల్లో ఉన్నాడ‌ని తెలుస్తోంది.

User Comments