మ‌నోడి రేంజ్ ఇక్క‌డ 20 కోట్లు?

Last Updated on by

స‌మ‌కాలీన స‌మ‌స్య‌ల్ని ప్ర‌తిబింబిస్తూ, తెలివైన స్క్రిప్టుల్ని ఎంచుక‌వడంలో విశాల్ త‌ర్వాతే. కోలీవుడ్‌లో ఎంత పోటీ ఉన్నా అగ్ర హీరోగా నిరూపించుకుని, తెలుగులోనూ త‌న‌కంటూ ఓ మార్కెట్‌ని ఏర్ప‌రుచుకున్నాడు. అత‌డు వేసే ప్ర‌తి అడుగు ఎంతో తెలివైనవి అని ఇటీవ‌లే రిలీజైన `అభిమ‌న్యుడు` నిరూపించింది. త‌మిళ‌నాట రాజ‌కీయాల పేరుతో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ నామ‌స్మ‌ర‌ణ చేస్తూ విశాల్ త‌న‌కు భారీ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇప్పుడు తెలుగులోనూ అంత‌కంత‌కు విస్త‌రించే ప‌నిలో ఉన్నాడు. ఆ క్ర‌మంలోనే త‌న కెరీర్ డెబ్యూ మూవీ, ల్యాండ్ మార్క్ సినిమా అయిన `పందెంకోడి` సీక్వెల్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. లింగుస్వామి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమా తెలుగు రిలీజ్ హ‌క్కుల్ని మెగా నిర్మాత ఠాగూర్ మ‌ధు ఛేజిక్కించుకున్నారు. దాదాపు 10 కోట్ల మేర వెచ్చించార‌ని తెలుస్తోంది. అయితే విశాల్ మార్కెట్ నిన్న మొన్న‌టి వ‌ర‌కూ అంత లేదు. ఇక్క‌డ 3-4 కోట్ల లోపే అత‌డి సినిమాల క్ర‌య‌విక్ర‌యాలు సాగేవి. అయితే అభిమ‌న్యుడు బంప‌ర్ హిట్ కొట్టి దాదాపు 20 కోట్లు పైగా వ‌సూలు చేసింద‌న్న టాక్ వ‌చ్చింది. దీంతో ఒక్క‌సారిగా విశాల్ క్రేజు స్కైని ట‌చ్ చేసింది. పైగా పందెం కోడి విశాల్ ఆరంగేట్రాన్ని ఆ లెవ‌ల్లో చూపించిన సినిమా. అందుకే ఈ సినిమాకి క్రేజు ఆకాశ‌పుటంచుల్ని తాకుతోంది. విశాల్ ప‌క్కా తెలుగోడు. తెలుగు పుష్క‌లంగా మాట్లాడుతాడు. అత‌డి సొంత డైలాగులు సినిమాకి బ‌లం. విశాల్‌లోని మాసిజం, లింగుస్వామిలోని టేకింగ్ వ‌ర్క‌వుటైతే ఈ సినిమా మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయం.

User Comments