విశాల్.. శ్రీ రెడ్డికి స్వీట్ వార్నింగ్

Last Updated on by

ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఇక్క‌డ కూడా విశాల్ రాజ‌కీయాల్లో బిజీ అయ్యేలా క‌నిపిస్తున్నాడు. ఇన్నాళ్లూ త‌న‌కు అన్నం పెట్టిన త‌మిళ‌నాడుపైనే ఫోక‌స్ చేసిన విశాల్.. ఇప్పుడు పుట్టిన‌నేల‌పై కూడా కాన్స‌ట్రేట్ చేస్తున్నాడు. అభిమ‌న్యుడు విడుద‌ల త‌ర్వాత ఎక్కువ‌గా తెలుగు రాష్ట్రాల్లోనే క‌నిపిస్తున్నాడు ఈ హీరో. ప‌నిలో ప‌నిగా ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌ను కూడా పాయింట్ ఔట్ చేస్తున్నాడు. క్యాస్టింగ్ కౌచ్ తో పాటు ఇక్క‌డ పీడిస్తున్న కొన్ని రాజ‌కీయ స‌మ‌స్య‌ల‌పై కూడా మాట్లాడుతున్నాడు విశాల్. రైతుల కోసం మొన్న అభిమ‌న్యుడులో వ‌చ్చిన లాభాల‌ను పంచుతున్నాడు.

దానికితోడు విశాఖ‌లో మ‌హిళ‌లు అత్య‌ధికంగా పని చేసే బ్రాండ్ ఎక్స్ కంపెనీకి వ‌చ్చాడు. అక్క‌డ 18 వేల మ‌హిళ‌ల‌తో వాళ్ల స‌మ‌స్య‌ల గురించి కూడా చ‌ర్చించాడు. దానికితోడు త‌న‌కు తోచిన సాయం చేస్తాన‌ని మాటిచ్చాడు. ఇక ఇప్పుడు శ్రీ‌రెడ్డి ఇష్యూపై కూడా మాట్లాడేసాడు. నాని త‌న‌కు మంచి స్నేహితుడు అని.. త‌ను అమ్మాయిల‌ను ఎంత గౌర‌వంగా చూస్తాడో త‌న‌కు తెలుసు అని.. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచిది కాద‌ని శ్రీ‌రెడ్డికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు విశాల్. అంతేకాదు.. ఇండ‌స్ట్రీలో ఉన్న సమ‌స్య‌ల గురించి అడిగి తెలుసుకుంటున్నాడు ఈ హీరో. ఇవ‌న్నీ చూస్తుంటే త్వ‌ర‌లోనే విశాల్ తెలుగులోనూ క్రియాశీల‌క పాత్ర పోషిస్తాడేమో అనిపిస్తుంది.

User Comments