క‌మ‌ల్‌హాస‌న్‌ వ‌న్‌మేన్ షో

Last Updated on by

`విశ్వ‌రూపం -1`లో ఒక్కో పాత్ర‌కు డీటెలింగ్ ఇస్తూ `విశ్వ‌రూపం 2` ఉత్కంఠ పెంచుతుంద‌ని విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల రిలీజ్ ముందు ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. ఆయ‌నేం చెప్పారో అదే తెర‌పై క‌నిపించింద‌ని నేడు సినిమా వీక్షించిన అభిమానులు చెబుతున్నారు. చెప్పిందే చేశాడు క‌మ‌ల్‌. తెర‌పై వండ‌ర్స్ చూపించాడ‌ని ప్ర‌శంసిస్తున్నారు. ముందే ప్ర‌క‌టించిన‌ట్టు `విశ్వ‌రూపం -2` కోర్టుల ప‌రిధిలో, ఇత‌ర‌త్రా వివాదాల ప‌రంగానూ అన్నిటినీ క్లియ‌ర్ చేసుకుని ప‌క్కాగా థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. నేడు `విశ్వ‌రూపం 2` థియేట‌ర్ల ముందు అభిమానుల‌ కోలాహాలం ఓ రేంజులో ఉంద‌ని తెలుస్తోంది.

ఇప్పటికి బాలీవుడ్‌లో మిక్స్‌డ్ రివ్యూలు వ‌చ్చినా ఇంకా టాలీవుడ్ రివ్యూలు రావాల్సి ఉంది. మ‌రి కాసేప‌ట్లో స‌మీక్ష‌ల వెల్లువ ఉంటుంది. అయితే వేకువ‌ఝాము నుంచి ఈ సినిమా వీక్షించిన వాళ్లు వ‌న్ వ‌ర్డ్ రివ్యూలు ప‌రిశీలిస్తే.. క‌మ‌ల్‌హాస‌న్ మ‌రోసారి న‌టుడిగా విశ్వ‌రూపం చూపించార‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. క‌మ‌ల్‌ న‌ట‌న‌ను ప్ర‌శంసించిన ఫ్యాన్స్.. స్క్రీన్ ప్లే అద్భుతం అంటూ పొగిడేశారు. సామాజిక మాధ్య‌మాల్లో క‌మ‌ల్ అభిమానుల సంబ‌రాలు చేసుకుంటున్నారు. మ‌రోవైపు కొంద‌రు ఈ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూలు చెప్పారు. అయితే `విశ్వ‌రూపం 2` అత్యంత క్రేజుతో రిలీజైన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో ఇరుగు పొరుగు సినిమాల్ని డామినేట్ చేయ‌డం గ్యారెంటీ అని చెబుతున్నారు. ఇప్ప‌టికి ప‌క్క సినిమాలు సోసోనే అన్న రిపోర్ట్ అందింది కాబ‌ట్టి, `విశ్వ‌రూపం 2` పాజిటివ్ టాక్‌తో రేసులో దూసుకుపోవ‌డం ఖాయ‌మ‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.

User Comments