ప‌ర్షియ‌న్‌ల‌కు `విశ్వ‌రూపం 2`

Last Updated on by

ఎన్నో వివాదాల మ‌ధ్య రిలీజై `విశ్వ‌రూపం` సంచ‌ల‌న విజ‌యం సాధించింది. సినిమాలో ద‌మ్ముంటే .. కంటెంట్ ఆక‌ట్టుకుంటే విజ‌యాన్ని ఆప‌లేర‌ని ఆ సినిమా నిరూపించింది. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్‌తో `విశ్వ‌రూపం 2` చిత్రాన్ని ఈ శుక్ర‌వారం (ఆగ‌స్టు 10) రిలీజ్ చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలు స‌హా, త‌మిళ‌నాడు, ఉత్త‌రాది రాష్ట్రాలు, అటు ఓవ‌ర్సీస్‌లో భారీగా రిలీజ‌వుతోంది. ఇప్ప‌టికే `విశ్వ‌రూపం 2` పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. స్పై థ్రిల్ల‌ర్‌లో క‌మ‌ల్‌హాస‌న్ యాక్ష‌న్‌ ఒళ్లు గ‌గుర్పాటుకు గురి చేయ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి.

ఈ సినిమా కేవ‌లం భార‌త‌దేశంలోనే కాదు, ప్ర‌పంచ దేశాల్లో క‌మ‌ల్ అభిమానుల‌కు క‌నువిందు చేయ‌నుంది. ముఖ్యంగా ప‌ర్షియ‌న్ థియేట‌ర్ `లీ గ్రాండ్ ఎక్స్‌`లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. క‌బాలి, మెర్స‌ల్, కాలా త‌ర్వాత ఇక్క‌డ‌ రిలీజ‌వుతున్న నాలుగో త‌మిళ చిత్రంగా `విశ్వ‌రూపం 2` రికార్డుల‌కెక్కుతోంది. వాస్త‌వానికి లీ గ్రాండ్ రెక్స్‌లో `విశ్వ‌రూపం` తొలి త‌మిళ చిత్రంగా రిలీజ్ కావాల్సింది. కానీ అప్ప‌ట్లో జ‌య‌ల‌లిత‌ ప్ర‌భుత్వం రిలీజ్‌కి బ్రేక్ వేయ‌డంతో ఆ అవ‌కాశం కోల్పోయింది. అప్పుడు ఛాన్స్ మిస్స‌యినా ఇప్పుడు క‌మ‌ల్ సినిమాకి ఆ అరుదైన గౌర‌వం, గుర్తింపు ద‌క్కుతోంది. భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ప‌ర్షియ‌న్ క‌ల్చ‌ర్‌కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌న సినిమా అక్క‌డ రిలీజ్ కావ‌డం భార‌తీయులుగా గ‌ర్వించ‌ద‌గ్గ‌ది.

User Comments