విశ్వ‌రూపం 2` వాయిదా లేదు

Last Updated on by

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన `విశ్వ‌రూపం 2` వాయిదా ప‌డుతోందంటూ ఒక‌టే ప్ర‌చారం సాగుతోంది. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి ఎం.క‌రుణానిధి ఆక‌శ్మిక మృతికి సానుభూతిగా ఈ వాయిదా త‌ప్ప‌ద‌ని ప్ర‌చారం సాగింది. అయితే వాయిదా అన్న మాట‌లో ఏమాత్రం నిజం లేద‌ని తాజాగా చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 10 రిలీజ్ తేదీతో పోస్ట‌ర్ల‌ను రిలీజ్‌ చేసింది. “రిలీజ్ య‌థాతథం. పోస్ట్‌పోన్ లేదన్న‌ది దీని సారాంశం“ విశ్వ‌రూపం 2 అత్యంత భారీ చిత్రం. పైగా ఆగ‌స్టు 10 రిలీజ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఇలాంటి వేళ వాయిదా వేస్తే ఎన్నో చిక్కులున్నాయి. ఇది ట్రేడ్‌కి సంబంధించిన మ్యాట‌ర్ కాబ‌ట్టి చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు తలెత్తుతాయ‌న‌డంలో సందేహం లేదు.

తెలుగు, త‌మిళ్‌, హిందీ స‌హా బ‌హుభాష‌ల్లో అత్యంత క్రేజీగా వంద‌లాది స్క్రీన్ల‌లో ఈ సినిమా రిలీజ‌వుతోంది. అలాంట‌ప్పుడు వాయిదా అసంబద్ధ‌మ‌ని ట్రేడ్‌లో చ‌ర్చ సాగుతోంది. ఒక‌వేళ ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డితే అది నితిన్ `శ్రీ‌నివాస క‌ళ్యాణం`కి క‌లిసొచ్చేదే. కానీ ఆ ఛాన్స్ లేద‌ని తాజా ప్ర‌క‌ట‌న తేల్చి చెప్పింది. ఇటీవ‌లే రిలీజైన విశ్వరూపం 2 ట్రైల‌ర్లు, మేకింగ్ వీడియోలు ఇప్ప‌టికే సినిమాపై అంచ‌నాల్ని పెంచాయి. నాలుగేళ్ల క్రితం విశ్వ‌రూపం పార్ట్ 1 చిత్రీక‌రించిన‌ప్పుడే పార్ట్ 2ని తెర‌కెక్కించారు. బ్యాలెన్స్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు క‌మ‌ల్. విజ‌యంపై ఎంతో ధీమాని క‌న‌బ‌రిచారు. ఈ సినిమా త‌ర్వాత పొలిటిక‌ల్‌గా పూర్తిగా యాక్టివ్ కానున్న క‌మ‌ల్‌కి విజ‌యం బూస్ట్‌నిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌మ‌ల్ అభిమానుల ఆకాంక్ష అది. నెర‌వేరుతుందో లేదో వేచి చూడాల్సిందే. జ‌స్ట్ ఇంకో 48 గంట‌లే .. క‌మ‌ల్ విశ్వ‌రూప వీక్ష‌ణ‌కు డెడ్‌లైన్‌.

User Comments