హైద‌రాబాద్‌లో క‌మ‌ల్ సంద‌డి

Last Updated on by

కొంద‌రికి ఆకాశ‌మే హ‌ద్దు. నింగి అంచును తాకేలా ఎదిగేయ‌డం అల‌వాటు. అలాంటి అరుదైన వ్య‌క్తిత్వం లెజెండ్ క‌మ‌ల్‌హాస‌న్‌ది. ఆస్కార్ అవార్డుల‌కు మ‌నం ఎందుకు వెళ్లం? అని ఆయ‌న్ని అడగొద్దు. ఆస్కార్‌కి వెళ్లే వాళ్లే మ‌న అవార్డుల‌కు రావాలి.. మ‌న హైద‌రాబాద్‌కి వ‌చ్చి అవార్డు అందుకోవాలి. మ‌న‌మే ఆస్కార్‌కు ప్ర‌త్యామ్నాయం క‌నిపెడ‌దామ‌న్న కాన్ఫిడెన్స్ ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్యం. అందుకే ఆయ‌న హైద‌రాబాద్‌కి వ‌స్తున్నారు అన‌గానే అభిమానుల్లో ఒక‌టే క్యూరియాసిటీ… ఊపిరిస‌ల‌ప‌ని ఉత్కంఠ‌. ది గ్రేట్ క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన `విశ్వ‌రూపం 2` ఆగ‌స్టు 10న అత్యంత వైభవంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ్‌, హిందీలో ఈ సినిమాని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఇత‌ర భాష‌ల్లో బోలెడంత ప్ర‌చారం చేశారు. ప్ర‌స్తుతం రిలీజ్ ముంగిట తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ కోసం విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఆ ప‌నిలో భాగంగా రేపు హైద‌రాబాద్ విచ్చేస్తున్నారు. క‌మ‌ల్ ఈ సంద‌ర్భంగా మీడియా ఇంట‌రాక్ష‌న్స్‌తో బిజీబిజీగా గ‌డిపేయ‌నున్నారు. విశ్వ‌న‌టుడి రాక‌తో రాజ‌ధాని ధ‌న్య‌మైన‌ట్టే. ఆయ‌న రాక‌కోసం అభిమానులు అంతే ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ గురువారం 4పీఎం నుంచి ఒక‌టే ఉత్కంఠ కొన‌సాగుతుంద‌న్న‌మాట‌.

User Comments