2గంట‌లు ఒణికిస్తార‌ట‌

Last Updated on by

`విశ్వ‌రూపం` వంటి టెక్న‌లాజిక‌ల్ వండ‌ర్‌ని చూపించారు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌. తాను న‌టిస్తూ, స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో అన్నీ తానే అయ్యి తెర‌కెక్కించిన `విశ్వ‌రూపం` 2013లో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తీవ్ర‌వాదం నేప‌థ్యంలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, భారీ యాక్ష‌న్‌తో మెరుపులు మెరిపించింది ఈ సినిమా. దాదాపు ఐదేళ్ల‌కు ఈ సినిమా సీక్వెల్ `విశ్వ‌రూపం 2` రిలీజ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే ఈ మూవీపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇది క‌మ‌ల్‌హాస‌న్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబ‌ట్టి, అంచ‌నాల్ని అందుకుని బంప‌ర్‌హిట్ కొడుతుందా? అంటూ ఒక‌టే ఉత్కంఠ‌గా ఎదురు చూస్తోంది లోకం.

ఆగ‌స్టు 10న `విశ్వ‌రూపం 2` రిలీజ్ చేస్తున్నామ‌ని క‌మ‌ల్ ప్ర‌క‌టించినప్ప‌టి నుంచి ఒక‌టే ఎగ్జ‌యిట్‌మెంట్‌. ఎన్నో వివాదాల న‌డుమ ఇన్నాళ్లు అంప‌శ‌య్య‌పై ఉన్న సినిమా ఎట్ట‌కేల‌కు రిలీజ‌వుతోంది. అయితే టెక్నికాలిటీస్‌లో కానీ, క‌థ‌, కంటెంట్ ప‌రంగా కానీ క‌మ‌ల్ ఏమాత్రం రాజీకి రారు కాబ‌ట్టి, ఈ సినిమా ఇంత గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్నా అంత‌కంత‌కు క్యూరియాసిటీ పెంచుతోంది. క‌మ‌ల్ అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఇందులోనూ పార్ట్ 1లో న‌టించిన పూజా కుమార్ క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ర‌న్‌టైమ్‌ని లాక్ చేశారు. దాదాపు 125 నిమిషాల పాటు అంటే సుమారు 2గంట‌ల 5నిమిషాలు ఈ సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుందిట‌. చివ‌రి నిమిషంలో రిలీజ్ ప‌రంగా ఎలాంటి చిక్కులు రాకుండా చాలా ముందే అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది టీమ్‌.

User Comments