`విశ్వ‌రూపం 3` స‌న్నాహాలు

Last Updated on by

సింహం ఎదురొస్తే ఖ‌డ్గ‌మృగ‌మే సైడిస్తుంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్ `విశ్వ‌రూపం 2` రిలీజ‌వుతోంది అన‌గానే, అటువైపు ప‌లు క్రేజీ సినిమాల్ని వ‌రుస‌గా వాయిదాలు వేసుకోవ‌డం కోలీవుడ్‌లో చ‌ర్చ‌కొచ్చింది. ప‌లువురు హీరోల సినిమాల‌తో పాటు, న‌య‌న‌తార లాంటి క్రేజీ స్టార్ న‌టించిన సినిమాని వాయిదా వేశారు. `విశ్వ‌రూపం 2` ఆగ‌స్టు 10న రిలీజ‌వుతోంది అన‌గానే, ఇత‌ర సినిమాల తేదీల్ని మార్చుకున్నారు.

అదంతా అటుంచితే, అంత‌గా క్యూరియాసిటీ పెంచుతున్న `విశ్వ‌రూపం -2` క‌థ ఏంటి? అంటే పార్ట్ 1తో కంటిన్యుటీ ఉన్న క‌థాంశ‌మేన‌ని తెలుస్తోంది. మేజ‌ర్ విస‌మ్ అహ్మ‌ద్ క‌శ్మీరీ పాత్ర‌లో క‌మ‌ల్ హాస‌న్ య‌థాత‌థంగా క‌నిపిస్తారు. అత‌డు రా సీక్రెట్ ఏజెంట్ అన్న సంగ‌తి రివీల్ చేసేప్పుడు ఆ పాత్ర ముగిసిపోలేద‌ని చూపిస్తున్నార‌ట‌. అంటే `విశ్వ‌రూపం 3` తెర‌కెక్కించేందుకు క‌మ‌ల్ క్లైమాక్స్‌లో దారి చూపిస్తున్నార‌ని తెలిసింది. పార్ట్ 2 సీక్వెల్ లేదా ప్రీక్వెల్ అన్న‌ట్టుగా ఉంటుందిట‌. రాహుల్‌బోస్‌, పూజా కుమార్‌, శేఖ‌ర్ క‌పూర్ పాత్ర‌ల‌కు ఎక్స్‌టెన్ష‌న్ ఉంటుంది. ఆండ్రియా గ్లామ‌ర్ అద‌న‌పు అస్సెట్ కానుందిట‌. గిబ్రాన్ ఒళ్లు గ‌గుర్పాటుకు గురి చేసే రీరికార్డింగ్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఇక విశ్వ‌రూపం వంటి ఇంటెలెక్చువ‌ల్ సినిమాలు తీయ‌డానికి స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటి? అని క‌మ‌ల్‌హాస‌న్‌ని ప్ర‌శ్నిస్తే, అందుకు చిన్న‌ప్పుడు త‌న అంకుల్ వినిపించిన ఇంటెలిజెన్స్ బ్యూరో క‌థ‌లే స్ఫూర్తినిచ్చాయ‌ని తెలిపారు.

User Comments