విశ్వ‌రూపం 2 మేకింగ్ వీడియో

Last Updated on by

ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్‌హాస‌న్ న‌ట విశ్వ‌రూపం వీక్షించేందుకు ఇంకెన్నో రోజులు లేదు. మ‌రో మూడు రోజుల్లోనే `విశ్వ‌రూపం 2` ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతోంది. తెలుగు రాష్ట్రాలు, హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. త‌మిళ‌ రిలీజ్‌కి ఎలాంటి ఆటంకాల్లేవ‌ని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అందుకే రిలీజ్ వేళ క్ష‌ణ‌క్ష‌ణం ఫ్యాన్స్‌లో ఒక‌టే ఉత్కంఠ‌. తీవ్ర‌వాదం అంతానికి క‌మ‌ల్ హాస‌న్ స్పై ఆప‌రేష‌న్ ఏంటో చూడాల‌న్న ఆత్రుత అభిమానుల్లో అంత‌కంత‌కు పెరుగుతోంది.

తాజాగా `విశ్వ‌రూపం 2` మేకింగ్ వీడియోని క‌మ‌ల్‌హాస‌న్ బృందం లాంచ్ చేసింది. త‌మిళ వీడియోలో క‌మ‌ల్ స్టంట్స్ మైమ‌రిపింప‌జేస్తున్నాయి. ఇప్ప‌టికీ క‌మ‌ల్ అంత యాక్టివ్‌గా సెట్స్‌లో టీనేజ‌ర్ లుక్‌లో క‌నిపిస్తుండ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆన్ లొకేష‌న్ క‌మ‌ల్‌ ఒక యుద్ధ‌వీరుడినే త‌ల‌పిస్తాడ‌ని మేకింగ్ వీడియో చెబుతోంది. సెట్స్‌లో అన్నీ తానే అయ్యి ఈ సినిమాని చేశారాయ‌న‌. అసిస్టెంట్ .. క్లాప్‌బోయ్‌.. హీరో.. ద‌ర్శ‌కుడు.. నిర్మాత‌.. ఇలా ప్ర‌తిదీ తానే. నేను హీరోని క‌దా! అని ఎక్క‌డో కుర్చీ వేసుకుని కూచుంటే అయ్యే ప‌ని కాద‌ని ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలోనూ ఆయ‌న వెల్ల‌డించారు. ఒక సినిమాని స‌క్సెస్ చేయాలంటే నిరంత‌ర శ్రామికుడిలా ప‌ని చేయాల‌ని సూచించారు. అందుకే క‌మ‌ల్ స‌ర్ .. ది గ్రేట్.

 

User Comments