వరుణ్ సందేశ్ భార్య ఈసారి వార్తల్లో అలా..!

Vithika Sheru Donates Hair Cancer Patients

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరూ రీసెంట్ గా వార్తల్లో ఏ రేంజ్ లో హడావుడి చేసిందో అందరికీ తెలుసు. మామూలు హెల్త్ ప్రాబ్లెమ్ లో భాగంగా రెస్ట్ తీసుకోవడానికి వేసుకున్న తక్కువ మోతాదు నిద్రమాత్రలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ కారణంగా హాస్పిటల్ కు వస్తే.. ఏకంగా కుటుంబ కలహాల కారణంగా వితిక ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరగడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో తర్వాత తేరుకుని వెంటనే అలాంటిదేమీ లేదని, మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామని స్వయంగా వితిక వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ గొడవంతా చివరకు సద్దుమణిగింది. ఇక అది మర్చిపోయాం అనుకున్న టైమ్ లోనే వితిక ఇప్పుడు మరో టాపిక్ తో వార్తల్లోకి వచ్చేయడం విశేషం.
అయితే, ఈసారి ఏ విధమైన టెన్షన్ పెట్టకుండా శభాష్ అనిపించుకుంటూ ప్రశంసలు అందుకోవడం గమనార్హం. ఆ స్టోరీలోకి వెళితే, తాజాగా వితిక తాను ఎంతగానో ఇష్టపడి పెంచుకున్న తలనీలాలను క్యాన్సర్ బాధితుల కోసం విరాళంగా ఇచ్చేసింది. ఈ సందర్బంగా వితిక మాట్లాడుతూ.. ఆహరం, డబ్బు లాంటివి విరాళంగా ఇవ్వడం సాధారణంగా చాలా మంది చేస్తుంటారని, అయితే ఏళ్ళ తరబడి ఇష్టానుసారంగా పెంచుకున్న తలనీలాలను ఇవ్వడం కొంత ఇబ్బందికరమేనని పేర్కొనడం గమనార్హం. అలాగే క్యాన్సర్ బాధితులను దృష్టిలో ఉంచుకుని ఓ సదుద్దేశ్యంతో తన తలనీలాలు క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అధ్యార్ (చెన్నై) కు విరాళంగా ఇచ్చానని, మీరు కూడా తలనీలాలు విరాళంగా ఇచ్చే విషయంలో ఓసారి ఆలోచించండి అని వితిక కోరడం అభినందిచాల్సిన విషయమే. అందుకే ఇప్పుడు వితిక చేసిన ఈ మంచి పనికి నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
వీడియో :