Voice Behind Bigg Boss - Revealed..! The Voice Behind Bigg Boss

ఎన్టీఆర్ బిగ్ బాస్ గొంతు ఎవరిదో తెలిసిపోయింది..!

Voice Behind Bigg Boss
Voice Behind Bigg Boss
తెలుగు బుల్లితెరపై ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులను మెప్పించే దిశగా అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీకెండ్ లో ఎన్టీఆర్ వస్తోన్న టైమ్ లో ఈ షో కు రెస్పాన్స్ సూపర్ గా ఉంటుందని న్యూస్ రాగా.. మిగిలిన రోజుల్లో సోసోగా నడుస్తుందని కామెంట్లు పడుతున్నాయి. ఇదిలా ఉంటే, కామన్ గా ఈ బిగ్ బాస్ షో మొత్తానికి ఒకరు కనిపించకుండా వినిపిస్తారనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మరెవరో కాదు.. ఎన్టీఆర్ తో సహా అందరికీ వినిపించే మన బిగ్ బాస్.
మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు అందరినీ కెమెరాలు ఓ కంట కనిపెడుతూ ఉంటే.. వాళ్ళందరూ ఎప్పుడు ఏం చేయాలో బిగ్ బాస్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా తనదైన గంభీరమైన వాయిస్ తో బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేయడం ఆడియన్స్ ను కూడా బాగానే ఆకట్టుకుంటుంది. మరి ఆ ఆదేశాలు ఇస్తుంది ఎవరు? ఆ వాయిస్ ఎవరిది? అనేది తెలుసుకోవాలని ఉందా.. అందుకే ఇప్పుడు ఆ విషయాలు బయటకొచ్చాయి. దానికంటే ముందు హిందీ బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో వాయిస్ అతుల్ కపూర్ ది కాగా, ఆయన ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని తెలుసుకోవాలి.
ఈ నేపథ్యంలోనే తెలుగులో బిగ్ బాస్ వాయిస్ ఎవరిదని ఆరా తీస్తే.. ఎక్కువగా సీరియల్స్ కు డబ్బింగ్ కు చెప్పే రాధాకృష్ణ అనే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ దని తెలియడం విశేషం. ఇకపోతే, ఈయన ఇప్పటికే చాలా సినిమాల్లో విలన్ పాత్రధారులకు డబ్బింగ్ కూడా చెప్పారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు బిగ్ బాస్ కు రాధాకృష్ణతో పాటు మాటీవీలో హిందీ డబ్బింగ్ సీరియల్స్ కు పనిచేసిన శంకర్ కూడా వాయిస్ ఇస్తున్నారని తెలియడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. ఈయన సీఐడీ సీరియల్ తెలుగు వెర్షన్ కు ఎక్కువగా పని చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు టీవీ సర్కిల్ లో వీరి పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. అలాగే సోషల్ మీడియా కూడా ఇప్పుడు ఈ బిగ్ బాస్ వాయిస్ వెనుకున్న వ్యక్తుల గురించి బాగానే ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ బిగ్ బాస్ గొంతు ఎవరిదో తెలిసిపోయింది..!
0 votes, 0.00 avg. rating (0% score)