ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ.. త‌ప్పెక్క‌డ జ‌రిగింది..?

ఈ రోజుల్లో సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డ‌మే అరుదు.. పైగా క్రేజీ హీరో ఉన్న సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే వ‌సూళ్లు వ‌ర‌ద‌లా వ‌స్తాయి. కానీ రామ్ విష‌యంలో మాత్రం ఎందుకో అది జ‌ర‌గ‌లేదు. ఎందుకంటే ఈయ‌న ఈ మ‌ధ్యే న‌టించిన ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ సినిమాకు కావాల్సినంత పాజిటివ్ టాక్ వ‌చ్చింది. రామ్ లాంటి క్రేజీ హీరో ఉన్న సినిమాకు టాక్ బాగుంటే.. టార్గెట్ మిస్ అయ్యే అవ‌కాశ‌మే లేదు. కానీ ఉన్న‌ది ఒక‌టే జిందగీ విష‌యంలో మాత్రం ఎందుకో అది జ‌రిగింది. ఈ చిత్రం ఊహించ‌ని విధంగా ఫ్లాపైంది. తొలిరోజు వ‌చ్చిన టాక్ కు.. వీకెండ్ లో వ‌చ్చిన వ‌సూళ్ల‌కు.. చివ‌రికి ఈ సినిమా ఆగిన జ‌ర్నీకి ఎక్క‌డా పొంత‌నే లేదు. టాక్ కు త‌గ్గ‌ట్లుగానే తొలి మూడు రోజుల్లోనే 11 కోట్ల షేర్ తీసుకొచ్చింది ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ. అలా వ‌చ్చేస‌రికి సినిమా నిల‌బ‌డింది అనుకున్నారు.

అస‌లు సినిమా అప్పుడే మొద‌ల‌వుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. త‌ర్వాత ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఈ చిత్రం మ‌రో 6 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ లైఫ్ టైమ్ క‌లెక్ష‌న్లు 17.30 కోట్ల ద‌గ్గ‌రే ఆగాయి. ఫ‌లితం సినిమా ఫ్లాప్. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 22 కోట్లు రావాలి. కానీ దానికి 5 కోట్ల దూరంలోనే ఆగిపోయింది ఈ చిత్రం. దాంతో క‌ష్ట‌మైనా ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ఫ్లాప్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. నేనుశైల‌జ కాంబినేష‌న్ కావ‌డంతో ఆ న‌మ్మ‌కంతోనే ఎక్కువ రేట్ల‌కు సినిమాను కొనేసారు. పైగా పాజిటివ్ టాక్ తో ఓపెన్ కావ‌డంతో సినిమా క‌చ్చితంగా సేఫ్ అవుతుంద‌నుకున్నారంతా. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. దాంతో రామ్ కు మ‌రో ఫ్లాప్ ప‌డింది. కాబట్టి ఈ కుర్ర హీరో నెక్స్ట్ సినిమానే మీద ఆశలు పెట్టుకోక తప్పదు మరి.

vunnadi okate zindagi Final Collections