విన‌య‌న్న బౌన్స్ బ్యాక్ ఎపుడు?

Last Updated on by

వి.వి.వినాయ‌క్ .. ఆ పేరే ఓ బ్రాండ్. ఆ నామ‌ధేయం ఓ సెన్సేష‌న్. టాలీవుడ్ 85ఏళ్ల చ‌రిత్ర‌లో ఎంద‌రో ద‌ర్శ‌కులు వ‌చ్చారు.. వెళ్లారు. ఆ క్ర‌మంలోనే వినాయ‌క్ లాంటి మాస్ డైరెక్ట‌ర్ రాక‌, కొత్త ఒర‌వ‌డిని సృష్టించింది. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ వ‌సూళ్లు అన్న మాట వినాయ‌క్‌తోనే మొద‌లైందంటే అతిశ‌యోక్తి కాదు. ఎన్టీఆర్ ఆది సినిమాతో 2002లో ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించిన వినాయ‌క్ ఆ త‌ర్వాత వ‌రుస‌గా ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు అందుకున్నారు. ఠాగూర్ అత‌డి కెరీర్ బెస్ట్ హిట్‌గా కీల‌క మ‌లుపును ఇచ్చింది. దిల్, చెన్న‌కేశ‌వ రెడ్డి, సాంబ చిత్రాలు గొప్ప విజ‌యాలు అందుకున్నాయి. ల‌క్ష్మీ లాంటి లేడీ ఓరియెంటెడ్ టైటిల్‌తో సినిమా తీసి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న ద‌ర్శ‌కుడిగా పేరొచ్చింది. కృష్ణ‌, యోగి, అదుర్స్, నాయ‌క్, అల్లుడు శ్రీ‌ను చిత్రాలు వినాయ‌క్‌లోని కాలిబ‌ర్‌కి నిద‌ర్శ‌నంగా నిలిచాయి.

వీట‌న్నిటిని మించి తాను అన్న‌య్యా అని పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవికి ఘ‌న‌మైన పున‌రాగ‌మ‌నాన్ని ఇచ్చింది వినాయ‌క్‌నే. ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంతో ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ ని ఇచ్చాడు.ఆ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద 150కోట్లు క‌లెక్ట్ చేసిన సంగ‌తి విదిత‌మే. సుప్రీమ్‌హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కించిన ఇంటెలిజెంట్ ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డం విన‌య్‌కి కెరీర్ ప‌రంగా కొంత‌వ‌ర‌కూ డ్రాబ్యాక్ అనే చెప్పాలి. అయినా న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో – సి.క‌ళ్యాణ్ నిర్మాత‌గా ఓ చిత్రం తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఈ సినిమా 2019లో సెట్స్‌కెళ్లే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వినాయ‌క్ బ‌ర్త్ డే నేడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకించి విషెస్ తెలియ‌జేస్తూ… స్టార్ డైరెక్ట‌ర్ తిరిగి కెరీర్ ప‌రంగా బౌన్స్ బ్యాక్ అవుతార‌నే ఆకాంక్షిద్దాం.

User Comments