వినాయ‌క్‌కి ఓకే చెప్పిన మాస్ రాజా!

Ravi Teja okays VV Vinayak's movie

ఖైదీనంబ‌ర్ 150 లాంటి ఇండ‌స్ట్రీ సెన్సేష‌న‌ల్ హిట్ మూవీని తెర‌కెక్కించారు వి.వి.వినాయ‌క్. చిరంజీవి 150వ సినిమా రూ.150 కోట్లు వ‌సూలు చేసిందంటే ఏ స్థాయి హిట్ కొట్టాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత వినాయ‌క్ గ్రాఫ్ ఒక్క‌సారిగా స్కైలోకి వెళుతుంద‌నే భావించారంతా. క‌ట్ చేస్తే.. సీన్ మొత్తం రివ‌ర్స‌య్యింది. వ‌రుస ఫ్లాప్ లు వినాయ‌క్ ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అక్కినేని చిన్నోడు అఖిల్ ని ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కించిన అఖిల్ డిజాస్ట‌ర్ అయ్యింది. భారీ బ‌డ్జెట్ పెట్టించి ఇలా తీసాడేంటి? అంటూ మాట్లాడుకున్నారంతా. ఆ త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్ తో తీసిన ఇంటెలిజెంట్ అంతే పెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది. క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం రెగ్యుల‌ర్ మూస‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాని న‌డిపించ‌డం అన్న ఫార్ములా ఫెయిలైంద‌ని విశ్లేషించారు.

ఆ త‌ర్వాత న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఓ ఆఫ‌ర్ ఇచ్చార‌ని, అయితే స్క్రిప్టుతో ఒప్పించ‌డంలో వినాయ‌క్ త‌డ‌బ‌డ్డార‌ని ప్ర‌చార‌మైంది. కార‌ణం ఏదైనా వినాయ‌క్ కెరీర్ ఖాళీ అయిపోయింది. ప్ర‌స్తుతం అత‌డు స్క్రిప్టు ప‌ట్టుకుని ప‌లువురు హీరోల్ని క‌లుస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. తాజాగా అత‌డు వినిపించిన స్క్రిప్టుకు మాస్ మ‌హారాజా ర‌వితేజ ఓకే చెప్పార‌ట‌. అయితే సెట్స్ కెళ్లేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. మాస్ రాజా ఇప్ప‌టికే వి.ఐ.ఆనంద్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టిస్తున్నారు. త‌దుప‌రి సంతోష్ శ్రీ‌నివాస్ – మైత్రి మూవీమేక‌ర్స్ కాంబినేష‌న్ లో సెట్స్ పైకి వెళ‌తారు. ఆ త‌ర్వాత వినాయ‌క్ తో సినిమా ఉండే ఛాన్సుంద‌ట‌. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మాస్ రాజా సైతం కెరీర్ ప‌రంగా వెన‌క‌బ‌డ్డారు. మ‌రి ఫ్లాప్ డైరెక్ట‌ర్ కి ఓ ఛాన్సిస్తున్నారు కాబ‌ట్టి ఆ ఇద్ద‌రూ ఎలా కంబ్యాక్ అవుతారో చూడాలి. కొన్నిటికి కాల‌మే సమాధానం. కాస్త వేచి చూడాలి.

Also Watch: Actress Asima Latest Stills