ఏడు దేశాల్లో `వార్` సీక్వెన్సులా?

అక్టోబ‌ర్ 2 రిలీజ్ అన‌గానే మెగాస్టార్ `సైరా` గుర్తుకొస్తుంది. ఈ సినిమాకి పోటీ లేదా? అంటే బాలీవుడ్ లో ఠ‌ఫ్ కాంపిటీషన్ ఉంది. అక్క‌డ కండ‌ల హీరోలు హృతిక్ రోష‌న్ – టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన భారీ యాక్ష‌న్ చిత్రం `వార్` అదే రోజు రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ మేర‌కు `సైరా`కు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ త‌ప్ప‌దు. ఇక ఈ రెండు సినిమాల్లో భారీ వార్ యాక్ష‌న్ సీక్వెన్సులు కామ‌న్ గా ఆడియెన్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌నున్నాయి. జోన‌ర్ల ప‌రంగా వైవిధ్యం .. అలాగే భారీ యాక్ష‌న్ విష‌యంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా` సినిమాకి సంబంధించి భారీ వార్ సీన్లు.. యాక్ష‌న్ స‌న్నివేశాల్ని అజార్ భైజాన్ లో చిత్రీక‌రించారు. సైరా స్టంట్స్ కి ప్ర‌ఖ్యాత‌ హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్లు ప‌ని చేశారు. హాలీవుడ్ నుంచి వ‌చ్చిన గ్రెగ్ పావెల్ – లీ విట్టేక‌ర్ ల‌తో క‌లిసి రామ్ -ల‌క్ష్మ‌ణ్ బృందం అహో రాత్రులు శ్ర‌మించారు. ఇక‌ హైద‌రాబాద్ లో వేసిన భారీ కోట చుట్టూ భారీ వార్ ఎపిసోడ్స్ ర‌క్తి క‌ట్టించ‌నున్నాయి.

ఇక బాలీవుడ్ చిత్రం `వార్` యాక్ష‌న్ సీన్స్ ని ఏడు దేశాల్లోని 15 ప్రధాన నగరాల్లో చిత్రీకరించారు. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్ ఫేం పాల్‌ జెన్సింగ్స్‌- డెత్‌రేస్‌ ఫేం ఫ్రాంజ్‌ స్పిల్హాస్‌- ఏజ్‌ ఆఫ్‌ ఆల్ట్రాన్‌, స్నో పియర్సర్‌ ఫేం సీ యంగ్‌- శాన్ ఆండ్రియాస్‌- పర్వేజ్‌ షేక్ వంటి టాప్ ఫైట్ కొరియోగ్రాఫ‌ర్స్ ప‌ని చేశారు. ఇంత‌మంది హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్లు ప‌ని చేశారు అంటే యాక్ష‌న్ ఏ రేంజులో ఉండ‌బోతోందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక ర‌కంగా సైరా – వార్ చిత్రాలు అభిమానుల‌కు డిఫ‌రెంట్ విజువ‌ల్ ఎక్స్ పీరియెన్స్ ని ఇవ్వ‌నున్నాయి.