పిక్ టాక్‌: స‌్ట‌న్నింగ్ పీసీ బాస్‌

Last Updated on by

కార్పొరెట్ ఆఫీస్ సొగ‌సు చూశారా?  స్టన్నింగ్ .. మైండ్ బ్లోయింగ్.. అంటూ పొగిడేయాల‌నుందా? అదంతా పీసీ బాస్ మ‌హిమ‌. ఖ‌రీదైన‌ సూటులో కావాల్సినంత రిలాక్సేష‌న్‌. దుమ్ము-ధూళి కణం రాలి ప‌డ‌ని ఏసీ గ‌దుల్లో పీసీ విన్యాసం ఇలా ఉంది మ‌రి. అస‌లే ఖ‌రీదైన వీల్ చైర్‌లో అలా రిలాక్స్‌డ్‌గా వాలిపోయిన తీరు.. అటుపై ఆ సూట్‌లో అంద‌చందాల ఎలివేష‌న్ చూస్తుంటే మ‌తి త‌ప్పి.. మ‌త్తెక్కి గిల‌గిలా కొట్టుకునేట్టే ఉందీ సీను.
ఇలా మ‌తి చెడ‌గొట్ట‌డం ఇప్పుడే కొత్త కాదు కానీ.. పీసీలో ఉన్న ఆ సంథింగ్ ఏదో ప్ర‌తిసారీ ప్ర‌పంచాన్ని ఆకర్షిస్తోంది. అందుకే ఇప్ప‌టికిప్పుడు క్వాంటికో సిరీస్‌తో హాలీవుడ్ మ‌న‌సు దోచించింది. బేవాచ్ త‌ర‌వాత ఏ కిడ్ లైక్ జేక్ అనే భారీ చిత్రంలోనూ అవ‌కాశం అందుకుంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఓవైపు సాగుతుండ‌గానే .. మ‌రోవైపు ఇటు బాలీవుడ్ పైనా దృష్టి సారించింది పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా. ఇక్క‌డ క్రేజీగా స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న `భ‌ర‌త్‌` అనే చిత్రంలో నాయిక‌గా న‌టించేందుకు సంత‌కం చేసింది. మ‌రోవైపు పలు బ‌యోపిక్‌ల‌లో న‌టించేందుకు స్క్రిప్టులు ప‌రిశీలిస్తోంది. గ‌జిబిజి బిజీబిజీ జీవితంలో తీరిక ఇంకేం చిక్కుతుంది. అందుకే ఇలా కాసింత రిలాక్సైంది అంతే. పీపీ బాస్‌ని అలా త‌ప్పుడు ఆలోచ‌న‌తో చూడ‌కు మిత్ర‌మా!

User Comments