ఖాకిల‌కు ఇక సెల‌వులు

రాష్ట్రంలో పోలీసులకు వీక్లీ ఆఫ్‌ని అమలు చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామన్నారు. శాంతిభద్రతలు కాపాడి ప్రజలకు భరోసా కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేస్తామని, మహిళల భద్రత కోసం ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు.

అనంతరం ఓ దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి సుచరిత కృతజ్ఞతలు తెలిపారు. ఖాకీల‌కు వారంత‌పు సెల‌వుల‌ను ప్ర‌క‌టించ‌డంతో పోలీసుల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే కొన్నిరాష్ర్టాల్లో ఈ విధానం అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే. అలాగే త్వ‌రిగతిన ఏపీలో పోలీసు నియామ‌కాలు కూడా చేప‌డితే నిరూద్యోగులు త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు.