జ‌గప‌తిబాబుపై వెబ్ సిరీస్‌

Last Updated on by

సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు జీవితాన్ని తెర‌పై చూపించ‌నున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. హీరోగా ప‌లు విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించిన జ‌గ‌ప‌తి కెరీర్ వ‌డ్డించిన విస్త‌రి ఏమీ కాదు. కెరీర్ పాకులాట‌లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాడు. అసలు ఈయ‌న హీరో ఏంటి? ఆ వాయిస్ హీరోయిజానికి ప‌నికి రాదు! అని తీసిపారేసిన వాళ్లు ఉన్నారు. అలాంటి క్రిటిసిజం ఉన్న చోట త‌న‌కంటూ ఓ స‌ప‌రేట్ రూటు ఉంద‌ని నిరూపించాడు జ‌గ‌ప‌తిబాబు.

ఆంధ్రుల అంద‌గాడు శోభ‌న్ బాబు త‌ర్వాత మ‌ళ్లీ ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌తో న‌టించిన జూ.శోభ‌న్‌బాబుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రియ‌మ‌ణి, ఆమ‌ని వంటి నాయిక‌ల‌తో ఎఫైర్లు సాగించిన హీరోగానూ జ‌గ‌ప‌తిబాబు పేరు చెబుతారు. అప్ప‌ట్లోనే ఓ యాంక‌ర్‌తో ఎఫైర్ అంటూ ప్ర‌చారం సాగింది. కెరీర్ అయిపోయింది అనుకుంటున్న టైమ్‌లో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చి అద‌ర‌గొట్టేశాడు. ఇలాంటి ఎన్నో మ‌సాలా మ్యాట‌ర్స్ ని వెబ్ సిరీస్‌లో చూపిస్తార‌నే మాట్లాడుకుంటున్నారు. 25 ఎపిసోడ్లుగా తెర‌కెక్కించ‌నున్న ఈ వెబ్ సిరీస్‌కి ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు? నిర్మాతలు ఎవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉందింకా.

User Comments