పీసీ పెళ్లి బాజా.. ప్రూప్ ఇదే

Last Updated on by

గ‌త కొంత‌కాలంగా పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ భామ విదేశీ బోయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్‌తో నిశ్చితార్థం పూర్తి చేసుకుంద‌ని, తొంద‌ర్లోనే పెళ్లాడేయ‌బోతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. పీసీ దాగుడుమూత‌ల దాంప‌త్యం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే దీనిపై పీసీ ఎలాంటి అధికారిక స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డంతో స‌స్పెన్స్ నెల‌కొంది.

అయితే ఈ స‌స్పెన్స్‌కి తెర దించుతూ `భ‌ర‌త్‌` ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్ చేసిన‌ ప్ర‌క‌ట‌న సంచ‌ల‌న‌మైంది. ఇక పీసీ పెళ్లి బాజాకు వేళాయింది. స‌ల్మాన్ స‌ర‌స‌న క్రేజీ ప్రాజెక్ట్ `భ‌ర‌త్` నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణ‌మిదేన‌ని అలీ జాఫ‌ర్ ప్ర‌క‌టించారు. అంతేకాదు పెళ్లి బంధంతో ఓ ఇంటిద‌వుతున్న పీసీకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు స‌ద‌రు ద‌ర్శ‌కుడు. 22 జూలై నుంచి భ‌ర‌త్ రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. అయితే ఈ సినిమా నుంచి తాను త‌ప్పుకుంటున్నాన‌ని పీసీ త‌న‌కు తెలిపింద‌ని జాఫ‌ర్ రివీల్ చేయ‌డంతో ఒక్క‌సారిగా వేడి పెరిగింది. ఇక పీసీ హాలీవుడ్ న‌టుడు నిక్ జోనాస్‌ని పెళ్లాడి లైఫ్‌లో సెటిల‌వుతోంద‌న్న‌మాట‌! అయితే పెళ్లి త‌ర్వాత త‌న‌కు న‌టించే వెసులుబాటు ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

User Comments