లేడీ రోబోట్ పెళ్లి జేగంట‌

Last Updated on by

2.0 చిత్రంలో లేడీ రోబోట్ గా న‌టించి మైమ‌రిపించింది ఎమీజాక్స‌న్. ఇండియాస్ బెస్ట్ హిట్ చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ సక్సెస్ సెల‌బ్రేష‌న్స్ లో క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఆ టైమ్‌లోనే ఈ అమ్మ‌డు అటు లండ‌న్ ప్రియుడు జార్జి ప‌నాయ‌టౌతో షికార్లు చేస్తూ ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ భామ నిరంత‌రం ప్ర‌యాణాల‌తోనే బిజీబిజీగా గ‌డిపేస్తుంటుంది. ఇండియా నుంచి లండ‌న్, లండ‌న్ నుంచి ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌కు ప‌య‌న‌మ‌వుతుంటుంది. ప్ర‌తి ఎగ్జోటిక్ జ‌ర్నీలో బోయ్‌ఫ్రెండ్ జార్జి త‌ప్ప‌నిస‌రి.

తాజాగా న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ని ఈ జంట జాంబియాలో చిలౌట్ చేశారు. అక్క‌డ చీమ చిటుక్కుమ‌న్నా, ఆకు ఫ‌ట‌క్కుమ‌న్నా సౌండ్ వినిపించే నిశీధి నిశ్శ‌బ్ధ‌ ప్రాంతంలో ఈ జంట ప్ర‌ణ‌యంలో మునిగి తేలింది. ప్ర‌స్తుతం ఇదో హాట్ టాపిక్. ఎగ్జోటిక్ లొకేష‌న్ సెల‌బ్రేష‌న్స్ ని ఫోటోల రూపంలో ఎమీజాక్స‌న్ అభిమానుల‌కు షేర్ చేసింది. “లైఫ్‌లో కొత్త సాహ‌సాలు స్టార్టెడ్… ఐ ల‌వ్ యు… ప్ర‌పంచంలోనే బెస్ట్ హ్యాపీ గాళ్‌ని అయినందుకు ఎగ్జ‌యిటింగ్‌“ అంటూ ప్రియుడితో సెల‌బ్రేష‌న్స్ మూడ్ లో కి వెళ్లిపోయింది. ఎమీజాక్స‌న్ ఈ ఉత్సాహంలోనే ఓ కీల‌క‌మైన హింట్ ని ఇచ్చింది. ఈ ఏడాది మా పెళ్లి ఉంటుంది అని అర్థం వ‌చ్చేలా నిశ్చితార్థ ఉంగరం ఈమోజీని ఇన్‌స్టాలో షేర్ చేసింది. మొత్తానికి కొత్త సంవ‌త్స‌రంలో ఈ అమ్మ‌డు పెళ్లి చేసుకుని ఓ ఇంటిది కాబోతోంద‌న్న‌మాట‌.

User Comments