విజయ్ దేవరకొండ `వరల్డ్ ఫేమస్ లవర్` ట్రైలర్ వచ్చింది. విజయ్ మార్క్ రొమాన్స్, ఆయన స్టైల్ డైలాగులతో ఆసక్తి రేకెత్తిస్తోంది ట్రైలర్. క్రాంతి మాధవ్ ఓ మంచి ప్రేమకథని, హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించాడని స్పష్టమవుతోంది. `ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏమైనా ఉందటే అది ప్రేమొక్కటే, ఆ ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు సునామీనే రేపగలవు` అనే డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్లో విజయ్ పలు రకాల గెటప్పుల్లో కనిపిస్తాడు.
శీనయ్య అనే పేరుతో సింగరేణి బొగ్గు కార్మికుడిగా, గౌతమ్ అనే ఓ ట్రెండీ కుర్రాడిగా ఆయన పాత్రలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. `గుండెకి తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెలియకుండా ఉండాలంటే ఫిజికల్‌గా ఈ మాత్రం బ్లీడ్ ఉండాలె`, `మీ ఆడోళ్లకి అస్సలు ఆగదానే… బట్ట ఉంటే ఒంటిమీద వేసుడేనాయే?`, `ఎవరు ఏది ప్రేమిస్తాదో అది వాళ్లకి దొరకాలి` `నేను అలసిపోయాను, నా మైండ్ నా హార్ట్ బ్లీడింగ్`, `జిందగీ ఏమైనా కమ్మగా ఉందా మామా` తరహా డైలాగులు ట్రైలర్లో వినిపిస్తున్నాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.