యాత్ర‌` బ‌డ్జెట్? లాభం ఎంత‌?

Last Updated on by

వైయ‌స్సార్ బ‌యోపిక్ `యాత్ర` ఇటీవ‌ల రిలీజైన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ డే పాజిటివ్ స్పంద‌న‌, తొలి వీకెండ్‌లో భారీ వ‌సూళ్ల‌తో సినిమా ఘ‌న‌ విజ‌యం వైపు దూసుకెళుతోంది. అయితే ఈ బ‌యోపిక్ ఏ స్థాయిలో లాభాలు తెస్తోంది? అస‌లు ఈ సినిమాకి పెట్టిన బ‌డ్జెట్ ఎంత‌? అంటూ ఆరాలు తీస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రాన్ని ప్ర‌మోష‌న్స్ క‌లుపుకుని కేవ‌లం రూ.15కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. ఓవ‌రాల్ గా 20 కోట్ల మేర లాభాలు ఆర్జించేందుకు ఆస్కారం ఉంద‌న్న‌ది ట్రేడ్ అంచ‌నా. వైయ‌స్ పాద‌యాత్ర‌లోని ఎమోష‌న్ ని కాప్చుర్ చేయ‌డంలో మ‌హి.వి.రాఘ‌వ్ సాధించిన గ్రిప్ ఇంత పెద్ద విజ‌యాన్ని అందించ‌బోతోందంటూ విశ్లేషిస్తున్నారు.

యాత్ర తొలి వీకెండ్ 6కోట్లు వ‌సూలు చేయ‌డం.. ఇప్ప‌టికీ అదే తీరుగా వ‌సూలు చేస్తుండ‌డంతో ఈ చిత్రం భారీ లాభాల దిశ‌గా వెళుతోంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఈ సినిమాకి థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో 10 కోట్లు ముందే వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ కి 8 కోట్ల‌కు లైవ్ స్ట్రీమింగ్ కి హ‌క్కులు అమ్మేశారు. ఇత‌ర‌త్రా రైట్స్ రూపంలో మ‌రో 10 కోట్లు రానుందిట‌. క‌లెక్ష‌న్స్ 15-17 కోట్ల వ‌ర‌కూ రాబ‌ట్టే ఛాన్సుంద‌ని విశ్లేషిస్తున్నారు. అంటే 17 కోట్లు క‌లెక్ష‌న్స్ కాకుండా మ‌రో 18 కోట్లు ఇత‌ర‌త్రా మార్గాల్లో వ‌చ్చింది. ఓవ‌రాల్ గా 35 కోట్లు ఈ సినిమా పేరుతో డ‌బ్బు చేతికి అందుతుంది కాబ‌ట్టి 15కోట్ల బ‌డ్జెట్ తీసేసినా.. 20 కోట్లు లాభం రావ‌డం ఖాయంగా అంచ‌నా వేస్తున్నారు. ఆ మేర‌కు విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డిల‌కు యాత్ర చిత్రం పెద్ద రేంజులో వ‌ర్క‌వుటైంద‌ని అంచ‌నా వేస్తున్నారు. బ‌యోపిక్ తీసినా, లేదా ఇంకేదైనా క‌థ‌తో తీసినా ఎమోష‌న్ వ‌ర్క‌వుటై, జ‌నాల‌కు క‌నెక్ట‌యితే ఏ రేంజు విజ‌యం అందుకోవ‌డానికైనా ఆస్కారం ఉంటుంది. సావిత్రి జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కించిన `మ‌హాన‌టి` చిత్రం ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట‌య్యింది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్ అంత స్థాయిలో క‌నెక్ట‌వ్వ‌లేదు. ఇప్పుడు యాత్ర క‌నెక్ట‌య్యింది. అందుకే ఈ విజ‌యం అని విశ్లేషిస్తున్నారు.

User Comments