సాహో సుజీత్ కొత్త ఎటెంప్ట్

యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ తెర‌కెక్కించిన సాహో ఇటీవ‌ల భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. సినిమా కు డివైడ్ టాక్ రావ‌డం…చిత్ర యూనిట్ దానికి కాంట్రాస్ట్ గా 400 కోట్లు వ‌సూళ్లు సాధించింద‌ని చెప్ప‌డం వంటివి ఏ మాత్రం న‌మ్మ‌శక్యంగా లేవని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. ప్ర‌స్తుతం ఆ విష‌యాల‌న్ని మ‌ర్చిపోయి ప్ర‌భాస్ జాన్ సినిమాపై ఫోక‌స్ పెడుతున్నాడు. కొద్ది రోజుల గ్యాప్ అనంత‌రం యాధావిధిగా జాన్ షూటింగ్ లొ పాల్గొన‌నున్నాడు.

ఇక చిత్ర నిర్మాత‌లు వంశీ ప్ర‌మోదులు త‌మ త‌దుప‌రి ప్రాజెక్ట్ ల‌తో బిజీ కానున్నారు. మ‌రి సుజిత్ వాట్ నెక్స్ట్ అన్న‌దే? ప‌్ర‌స్తుతానికి ప‌్ర‌శ్నార్ధ‌కం. ఓ చిన్న సినిమాతో ప్రారంభ‌మై సెకెండ్ ఛాన్స్ 350 కోట్ల రూపాయాల సినిమా చేసే అరుదైన అవ‌కాశాన్ని అందుకున్నాడు. కానీ ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవడంలో విఫ‌ల‌మ‌య్యాడు. మ‌రి ఇప్పుడు సుజిత్ ఏ హీరోతో సినిమా చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు అన్న దానిపై క్లారిటీ లేదు. సాహో ప్లాప్ నేప‌థ్యంలో స్టార్ హీరోలెవ‌రు అత‌నికి అవ‌కాశం ఇచ్చే సాహ‌సం చేయ‌రు. యంగ్ హీరోల‌ను మెప్పించాల‌న్నా మంచి క‌థ కుద‌రాలి. మ‌రి ఆ క‌థ‌లు ఇప్ప‌టికే రాసి పెట్టుకున్నాడా? కొత్త‌గా సిద్దం చేయాలా? అన్న‌ది కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వ‌స్తుంది.