రింగులో ఫింగ‌ర్ తొడిగేదెపుడు?

Last Updated on by

త‌మిళ హీరో ఆర్య గురించి, ఆర్య‌లోని ఫ‌న్ ఎలిమెంట్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా తెలుసు. అతడు వ‌రుడు సినిమాలో విల‌న్‌గా న‌టించినా, అనుష్క `వ‌ర్ణ` చిత్రంలో సైడ్ రోల్ చేసినా, రాజా రాణి చిత్రంలో కామెడీ స్టార్‌గా క‌నిపించినా అంద‌రికీ పిచ్చిగా న‌చ్చేశాడు. అందుకే అప్ప‌ట్లో ఆర్య ఇక పెళ్లాడేస్తాను. పిల్ల కావాలి.. అంటూ ఓ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసేప్ప‌టికి దేశంలోని యువ‌తులంతా ఆశ‌ప‌డ్డారు. క‌ల‌ల్లోనే కాలిపోయారు. ఆ కాక‌లో ఆర్య‌కు ఏదో ఒక సంబంధం సెట్ట‌యిపోద్ద‌నే భావించారంతా. క‌ట్ చేస్తే ఇప్ప‌టికీ ఆర్య సింగిల్ స్టాట‌స్‌లోనే ఉన్నాడు. అత‌డి ప్ర‌క‌ట‌న విని ఏ పిల్లా అత‌డిని వెతుక్కుంటూ రాలేదో, లేక వ‌చ్చినా అత‌డికి న‌చ్చ‌లేదో తెలీదు కానీ, ఆర్య మాత్రం స్టిల్ బ్యాచిల‌ర్‌. ఇటువైపు అనుష్క త‌ర‌హాలోనే అత‌డు కూడా పెళ్లి గ‌డ‌ప ముంగిట వెయిటింగులోనే ఉన్నాడు.

ఏదైతేనేం.. ఇప్పుడు ఆర్య కంటే ముందు త‌మ్ముడు స‌త్యకి పెళ్ల‌యిపోయింది. అత‌గాడు అన్న స‌మ‌క్షంలో వ‌ధువు మెడ‌లో తాళి క‌ట్టేశాడు. స‌త్య న‌టుడిగా రాణించాల‌ని క‌ల‌గ‌న్నాడు. అన్న సాయ‌మూ ఉంది. అయితే ఈలోగానే అన్న కంటే ముందే పెళ్లాడేశాడేంటో? చెన్న‌య్ ఎంఆర్‌సీ న‌గ‌ర్‌లోని లీలా ప్యాలెస్ క‌ళ్యాణ‌మండ‌పంలో స‌త్య తాను వ‌ల‌చిన భావ‌నను మ‌నువాడేశాడు. రింగులో ఫింగ‌ర్ తొడిగేశాడు. త‌మ్ముడు ఏదో చేసేసుకున్నాడు స‌రే.. అన్న ఎప్పుడు రింగు తొడిగేది?

User Comments